ఆర్మీ స్కూల్లో ఉద్యోగాలు.. 8000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8వేల టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఇందుకోసం నిర్వహించే ప్రాథమిక పరీక్ష తేదీని ఖరారు చేశారు. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ పరీక్ష నిర్వహిస్తోంది. వీటిలో టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబరు 20. ఈ పోస్టులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ నవంబరు 21,22 తేదీల్లో ఉంటుంది.
గమనిక: పరీక్షలో ఉత్తీర్ణులైనవారు సంబంధిత పాఠశాలలు విడుదల చేసే ప్రకటనను అనుసరించి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ఆయా పాఠశాలలు తదుపరి నియామక ప్రక్రియ (ఇంటర్వ్యూ, బోధనా నైపుణ్యాల పరిశీలన, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ) ద్వారా ఖాళీలను భర్తీ చేస్తాయి. సాధారణంగా నవంబరు-మార్చి మధ్యలో ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీలు: 8000
పోస్టులు: టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ/రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సీటెట్/ఆయా రాష్ట్రాల టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు. ఐదేళ్ల టీచింగ్ అనుభవం ఉన్న వారికి గిరష్ట వయోపరిమితి 57 ఏళ్లు.
స్క్రీనింగ్ పరీక్ష తేదీ: నవంబరు 21,22 తేదీల్లో ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 20, 2020
అభ్యర్థులు పూర్తి వివరాలకు http://aps-csb.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com