మెట్రో ప్రయాణికులకు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి కాదు!

మెట్రో ప్రయాణికులకు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి కాదు!
మెట్రో ప్రయాణికులకు ఆరోగ్యసేతు యాప్ తప్పని సరి కాదని ప్రభుత్వం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.

మెట్రో ప్రయాణికులకు ఆరోగ్యసేతు యాప్ తప్పని సరి కాదని ప్రభుత్వం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సెప్టెంబర్ 7నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు మొదలవుతున్న విషయం తెలిసిందే. దీంతో, మెట్రో ప్రయాణికులు ఆరోగ్యసేతు యాప్ ను తప్పని సరిగా డౌన్లోడ్ చేసుకోవాలనే నిబంధనను కేంద్రం తప్పని సరి చేయాలనే యోచనలో ఉన్నట్టు ప్రచారం సాగింది. అయితే, మెట్రో ప్రయాణాలు మొదలవుతున్న నేపథ్యంలో కేంద్రం మెట్రో రైలు కార్పొరేషన్ల ఎండీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఎండీలంతా ఆరోగ్యసేతు యాప్ తప్పని చేసి చేస్తే.. స్మార్ట్ ఫోన్ లేని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. దీంతో కేంద్రం ఈ మేరకు ఆరోగ్యసేతు యాప్ తప్పని సరి కాదని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story