ఆ ఆరు రాష్ట్రాల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్

వచ్చే ఏడాది జరగనున్న ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటి చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. గురువారం జరిగిన తొమ్మిదవ జాతీయ మండలి సమావేశంలో కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు.ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ , పంజాబ్' రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటి చేస్తోందని అన్నారు.
ఢిల్లీలో అమలవుతున్న నీటి, విద్యుత్ రాయితీలతో పాటు సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేసి, ప్రజలను చేరుకోవాలని కోరుకుంటున్నట్టుగా కేజ్రీవాల్ తెలిపారు. జనవరి 26న జరిగిన రైతన్నల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారడంపై కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. ఘటనకి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మనమంతా ఎప్పటిలాగే రైతులకు మద్దతు ఇవ్వాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com