Arvind Kejriwal : కేజ్రీవాల్ టెర్రరిస్టు అన్న ప్రతిపక్ష నేతల ఆరోపణలకు ఢిల్లీ సీఎం కౌంటర్..!

Arvind Kejriwal : కేజ్రీవాల్ టెర్రరిస్టు అన్న ప్రతిపక్ష నేతల ఆరోపణలకు ఢిల్లీ సీఎం కౌంటర్..!
Arvind Kejriwal :ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశ రాజధానిలోని రాజోక్రీలో ఒకేసారి 12 వేల స్మార్ట్‌ క్లాసులను ప్రారంభించారు.

Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశ రాజధానిలోని రాజోక్రీలో ఒకేసారి 12 వేల స్మార్ట్‌ క్లాసులను ప్రారంభించారు. ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్య అందుకోవాలని బాబా సాహెబ్ అంబేద్కర్ కల కనేవారని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

రాజ్యాంగ నిర్మాత కలను నెరవేర్చినందుకు తమకెంతో సంతోషంగా ఉందన్నారు. కేజ్రీవాల్ టెర్రరిస్టు అన్న ప్రతిపక్ష నేతల ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. టెర్రరిస్టు అని పిలుస్తున్న కేజ్రీవాలే‌.. ఈరోజు దేశం కోసం 12 వేల 430 క్లాసు రూంలను అంకితం ఇస్తున్నారని గుర్తుపెట్టుకోవాలని చురకలంటించారు.

240 ప్రభుత్వం పాఠశాలల్లో ఢిల్లీ ప్రభుత్వం ఈ స్మార్ట్ క్లాసులను నిర్వహించనుంది. ఈ స్మార్ట్ క్లాసు రూంలతో కలిపి కేజ్రీవాల్ ప్రభుత్వం మొత్తం 20 వేల క్లాసు రూంలను ఏర్పాటు చేసింది. అందులో 537కొత్త స్కూల్ బిల్డింగ్స్ కూడా ఉండగా.. లైబ్రరీలు, మల్టీ పర్పస్ హాల్స్ లాంటివన్నీ ఏర్పాటు చేశారు.


Tags

Next Story