Asharambapu life sencentence: చేసిన పాపానికి సరైన శిక్ష

Asharambapu life sencentence: చేసిన పాపానికి సరైన శిక్ష
X
ఆశారామ్ బాపుకు జీవిత ఖైదు; స్వామిజీ ముసుగులో మైనర్ పై లైంగిక దాడి
మత గురువు ముసుగులో చిన్నారులపై లైంగిత దాడులకు పాల్పడుతున్న ఆశారామ్ బాపూకు జీవితఖైదు విధిస్తూ గుజరాత్ లోని గాంధీనగర్ కోర్టు తీర్పునిచ్చింది. 2013లో రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో తన ఆశ్రమంలో పనిచేస్తున్న మైనర్ బాలికపై 81ఏళ్ల ఆశారామ్ బాబు లైంగిక దాడికి పాల్పడటంతో అతడిపై కేసు నమోదు అయింది. తాాజాగా విచారణలో ఆశుఫల్ హర్పలానీ అలియాస్ ఆశారామ్ బాపు పై వచ్చిన ఆరోపణలు అన్నీ నిజమని నిర్థారణ అవ్వడంతో అతడికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కేసులో సహ నిందితులుగా పేర్కొన్న మరో ఐదుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. వీరిలో ఆశారామ్ భార్య కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం జోథ్ పూర్ జైలులోనే ఊచలు లెక్కపెడుతోన్న ఆశారామ్ అక్కడే జీవితఖైదు అనుభవిస్తాడని తెలుస్తోంది.

Tags

Next Story