Assam: మనతో మామూలుగా ఉండదు మరి! టూరిస్టులకు చుక్కలు చూపించిన రైనో...
Assam

అస్సోం: జంగిల్ సఫారీలో క్రూరమృగాలను చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న టూరిస్టులకు ఓ నీటి ఏనుగు చుక్కలు చూపించింది. అస్సోంలోని ఖాజీరంగా జాతీయ పార్క్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఖాజీరంగా అటవీ ప్రాంతంలో రైనోల సంతతి గణనీయంగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. అక్కడకి పర్యాటకుల తాకిడి కూడా గట్టిగానే ఉంటోంది. ఇక క్రిస్మస్ హాలిడేస్ పురస్కరించుకుని జంగిల్ సఫారీకి వెళ్లిన ఓ బృందానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఓ రైనో.
ఓపెన్ జీప్ లో సఫారీకి వచ్చిన ఓ బృందాన్ని గమనించిన రైనో పొదల మాటు నుంచి సడన్ గా బయటకు వచ్చిన వారిని భయపెట్టేందుకు ప్రయత్నించింది. దాని స్పీడ్ చూసి భయపడ్డ పర్యాటకులు గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ జీప్ ను ముందుకు ఉరికించాడు. అప్పటికీ వారిని విడిచిపెట్టని రైనో కిలోమీటర్ మేర వారిని తరుముతూనే ఉంది. ఈ ముచ్చటను వీడియో తీసి సోషల్ మీడయాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.
గతంలోనూ ఆ ప్రాంతంలో పర్యాటకులపై రైనోల దాడి చేసిన సంఘటనలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com