Assam: అసోంలో భారీ అగ్నిప్రమాదం
By - Subba Reddy |17 Feb 2023 5:45 AM GMT
150 దుకాణాలు అగ్నికి ఆహుతి
అసోంలోని జోర్హాటల్‌లో శుక్రవారం తెల్లవారుఝామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. చౌక్ బజార్‌లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కన ఉన్న షాపులకు విస్తరించడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మొత్తం 150 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. 25 ఫైర్ ఇంజిన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. రెండు నెలల్లో భారీ అగ్నిప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఇక షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు అంటుకున్నట్లు అధికారులు ప్రాథ మికంగా అంచానావేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com