Assembly Election Results: అసెంబ్లీ ఎన్నికలు.. గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

Assembly Election Results: ప్రాంతాల వారీగా చూసుకున్నా బీజేపీ గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం సాధించినట్లుగా స్పష్టమవుతోంది.. సౌరాష్ట్ర, నార్త్, సౌత్, సెంట్రల్ గుజరాత్‌లో బీజేపీకి గత ఎన్నికలతో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలనే కనబరుస్తోంది.. సౌరాష్ట్రలో 18, నార్త్ గుజరాత్‌లో 12 మధ్య గుజరాత్‌లో 16, దక్షిణ గుజరాత్‌లో ఒక స్థానాన్ని పెంచుకుని గత అసెంబ్లీ ఎన్నికలకంటే సుమారు 48 సీట్లలో స్పష్టమైన మెజారిటీతో దూసుకుపోతోంది.
అదే సమయంలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిపోయింది.. గతంలో సాధించిన స్థానాలను కూడా నిలబెట్టుకోలేక కుదేలైపోయింది.. బీజేపీపై గతంలో కంటే సానుకూలత పెరగడం ఒక కారణమైతే.. అగ్రనేతలు ఒక్కరు కూడా పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనకపోవడం కాంగ్రెస్ పాతాళానికి పడిపోవడానికి ప్రధాన కారణంగా ఆ పార్టీ నేతలే చెప్తున్నారు..
ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గుజరాత్‌లో మంచి ఫలితాలనే సాధిస్తోంది.. పోటీ చేసింది మొదటిసారే అయినా కాంగ్రెస్‌తో పోల్చితే చెప్పుకోదగ్గ సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.. ప్రాంతాల వారీగా ఆమ్ ఆద్మీ పార్టీ ఫలితాలను చూస్తే సౌరాష్ట్రలో ఆరు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.. నార్త్ గుజరాత్‌లో ఒక స్థానంలో, సెంట్రల్ గుజరాత్‌లో ఒక స్థానంలో, అలాగే సౌత్ గుజరాత్‌లో రెండు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతోంది..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com