శుభవార్త.. మీ పీఎఫ్ డబ్బులు కేంద్రమే..

శుభవార్త.. మీ పీఎఫ్ డబ్బులు కేంద్రమే..
కంపెనీలు కొత్తగా ఎవరినైనా ఉద్యోగంలోకి తీసుకుంటే వారి తరపున కేంద్ర ప్రభుత్వమే పీఎఫ్ డబ్బులు కడుతుంది.

దేశంలో ఉపాధి పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని లాంచ్ చేసింది. 2020 అక్టోబర్ 1 నుంచి 2021 జూన్ 30 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వమే ఉద్యోగుల పీఎఫ్ డబ్బులను చెల్లిస్తుంది. అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు.

కంపెనీలు కొత్తగా ఎవరినైనా ఉద్యోగంలోకి తీసుకుంటే వారి తరపున కేంద్ర ప్రభుత్వమే పీఎఫ్ డబ్బులు కడుతుంది. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. ఉద్యోగి పీఎఫ్ సబ్‌స్క్రైబర్ అయ్యి ఉండకూడదు. అలాగే మార్చి 1 నుంచి సెప్టెంబర్ 31 మధ్యలో ఉద్యోగం కోల్పోయిన వారికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది.

ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వమే 24 శాతం పీఎఫ్ కంట్రిబ్యూషన్ చెల్లిస్తుంది. ఇందులో ఉద్యోగి వాటి 12 శాతం, కంపెనీ వాటి 12 శాతం. రెండేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా పీఎఫ్ డబ్బులు కడుతూ వస్తుంది. 1000కి లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీలకు కేంద్రం 24 శాతం పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను చెల్లిస్తుంది. అదే 1000కి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలో జాబ్ వస్తే.. కేంద్రం ఉద్యోగి 12 శాతం వాటాను మాత్రమే చెల్లిస్తుంది.

Tags

Next Story