Attack On Sonu Nigam: సింగర్ పై దాడి

బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ పై ఓ అభిమాని దాడి చేసి గాయపరిచాడు. ముంబైలోనూ చెంబూర్ లో శివసేన ఏర్పాటు చేసిన ఓ కాన్సర్ట్ లో సోనూ పాలుపంచుకున్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోనూ వేదిక మెట్లు దిగుతుండగా పలువురు అభిమానులు అతడితో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. వారిని వారించేందుకు సెక్యూరిటీ గార్డులు ప్రయత్నించారు. ఈ క్రమంలో అభిమానులు అత్యుత్సాహంతో ఎగబడటంతో ఓ సెక్యూరిటీ గార్డ్ వేదిక మీద నుంచి కింద పడిపోయాడు. సోనూ నిగమ్ సైతం మెట్లుపై నుంచి జారి కింద పడబోయాడు. అయితే, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేదని సింగర్ సోనూ స్పష్టం చేశాడు. సెల్ఫీ కోసం వీరి అత్యుత్సాహం వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేదని, దేవుడి దయ వల్ల అలా ఏమీ జరగలేదని తెలిపాడు. సెల్ఫీ కోసం సెలబ్రిటీలను ఒత్తిడి చేయకూడదని అన్నాడు. అందుకే ఈ ఘటనపై పోలీస్ కంప్లైంట్ నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు కార్యక్రమ నిర్వాహకులు, శివసేన నాయకుడు ప్రకాశ్ పటెర్పెకర్ ఇది చాలా చిన్న విషయం అని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com