Body Builder Nurse:నర్సుగా విధులు నిర్వర్తిస్తూనే ఒలింపిక్స్‌లో పతకం కోసం ప్రయత్నాలు..

Body Builder Nurse:నర్సుగా విధులు నిర్వర్తిస్తూనే ఒలింపిక్స్‌లో పతకం కోసం ప్రయత్నాలు..
Body Builder Nurse: ఇష్టంతో చేస్తే ఏపనీ కష్టం కాదంటోంది లిపిక. ప్రభుత్వ నర్సుగా విధులు నిర్వర్తిస్తూనే.. తనకిష్టమైన బాడీ బిల్డింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా చెబుతోంది.

Body Builder Nurse: ఇష్టంతో చేస్తే ఏపనీ కష్టం కాదంటోంది లిపిక. ప్రభుత్వ నర్సుగా విధులు నిర్వర్తిస్తూనే.. తనకిష్టమైన బాడీ బిల్డింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా చెబుతోంది.

జాతీయ స్థాయి మహిళల బికినీ ఫిట్‌నెస్ బాడీబిల్డింగ్ పోటీల్లో మాల్దాకు చెందిన ప్రభుత్వ నర్సు తృతీయ స్థానంలో నిలిచింది. మిసెస్ యూనివర్స్ పోటీలో కూడా ఆమె ఆరో స్థానంలో నిలిచింది. ఈ పోటీలు మహారాష్ట్రలోని పూణెలో ఏప్రిల్ 15 నుంచి 18 వరకు జరిగాయి. మిస్టర్ అండ్ మిసెస్ యూనివర్స్ 2022 పోటీని ఇండియన్ బాడీబిల్డింగ్ ఫిట్‌నెస్ ఫెడరేషన్ నిర్వహించింది. ఈ పోటీల్లో మాల్దాలోని చంచల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నర్సు లిపికా దేబ్‌నాథ్ పాల్గొన్నారు. ఆమె విజయం పట్ల ఆమె కుటుంబం ఆమెకు శిక్షణ ఇచ్చిన కోచ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

లిపికా దేబ్‌నాథ్ ప్రస్తుతం మాల్దాలో ఉద్యోగం చేస్తోంది. అయితే, ఆమె ఇల్లు త్రిపురలో ఉంది. అక్కడి నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించి మాల్ధాకు వచ్చి బాడీ బిల్డింగ్ లో శిక్షణ తీసుకుంటోంది. మాల్దాలోని చంచల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోనే నర్సుగా పనిచేస్తోంది. చిన్నప్పటి నుంచి బాడీ బిల్డింగ్‌పై ఆసక్తి. తండ్రి స్ఫూర్తితో చిన్నతనం నుంచి బాడీ బిల్డింగ్ లో శిక్షణ తీసుకుంటోంది. విధులు పూర్తయిన తరువాత కూడా మాల్దాలోని జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తుంది.

లిపికా దేబ్‌నాథ్ మాట్లాడుతూ తాను వృత్తి రీత్యా నర్సు. కానీ బాడీ బిల్డింగ్ అంటే చిన్నప్పటి నుంచి హాబీ. అందుకే ప్రభుత్వ నర్సుగా పనిచేయడమే కాకుండా నిత్యం శారీరక వ్యాయామాలు చేస్తాను. నా విజయానికి నా తండ్రి ప్రోత్సాహం చాలా ఉంది అని సంతోషంగా చెబుతోంది. లిపికా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడా పోటీలో పాల్గొనాలనుకుంటోంది. నా పనితో పాటు ఈ బాడీ బిల్డింగ్‌ను కొనసాగించాలనుకుంటున్నాను అని అంటోంది.

Tags

Read MoreRead Less
Next Story