ఏపీలో ఉద్యోగాలు.. ఇంటర్వూ ద్వారా భర్తీ.. మరో రెండు రోజుల్లో..

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అరబిందో ఫార్మా కంపెనీలో 150 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఈ నెల 11న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్ధులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఇంటర్వ్యూకు హాజరుకాదలచిన అభ్యర్ధులు ఈనెల 11న ఉదయం 9 గంటల నుంచి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
అర్హత: బీ ఫార్మసీ, డిప్లొమా, ఐటీఐ (ఎలక్ట్రానిక్, మెకానికల్, ఫిట్టర్, ఇన్ స్ట్రుమెంటేషన్), బీఎస్సీ (కెమిస్ట్రీ) తదితర విద్యార్హతలు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్ధులు ఆయా కోర్సుల్లో 2017, 2018, 2019, 2020లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక:
ఇంటర్వ్యూకు హాజరైన విద్యార్ధులకు టెక్నికల్, హెచ్‌ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అందులో అభ్యర్ధులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్ధులు నెల్లూరు జిల్లాలోని నాయుడు పేట మండలంలోని కంపెనీ కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://apssdc.in/వెబ్‌సైట్ చూడొచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com