రేపట్నుంచి ఈ ఆటోమేటిక్ చెల్లింపులు ఉండవ్ గురూ! నెట్‌ఫ్లిక్స్ రీఛార్జ్ కాదు, ప్రైమ్ వీడియోస్ లాగిన్ కాకపోవచ్చు! బీ కేర్‌ఫుల్

ఇప్పటిదాకా మీ యుటిలిటీ బిల్స్ అంటే కరెంట్ బిల్, ఫోన్ రీఛార్జ్‌లు, డిటిహెచ్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లాంటి ఓటిటి రీఛార్జ్‌లు ఇక ఆటోమేటిగ్గా అయిపోవు.రూల్స్ మారిపోయాయ్. ఇంకా డీటైల్డ్‌గా చెప్పాలంటే కొన్ని రకాల పేమెంట్స్ మనం ఆన్‌లైన్లో పే చేసేందుకు కొన్ని డెబిట్, క్రెడిట్ కార్డ్స్‌తో లింక్ చేసి ఉంటాం.
అలా చేయడం వలన మనకి రివార్డ్ పాయింట్స్ కావచ్చు..మరో ఆఫర్ కావచ్చు వర్తిస్తుందనే కారణంతో కావచ్చు. దాంతో పాటే ఆటోమేటిగ్గా ప్రతి నెలా మనం గుర్తుపెట్టుకుని పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి చాలామంది కార్డ్ యూజర్లు ఈ పద్దతికి టర్న్ అయ్యారు. అంతేకాకుండా క్యూలైన్లుతప్పించుకోవడం కూడా మరో కారణమే.
ఐతే ఏప్రిల్ 1 నుంచి అంటే రేపట్నుంచి అలాంటి పేమెంట్లకు ఆర్బీఐ గుడ్‌బై చెప్పేసింది. వినియోగదారుల డబ్బుకి భద్రత కల్పించేందుకు సేఫ్టీ యాంగిల్‌లో ఆర్బీఐ ఈనిర్ణయం తీసుకుంది. మరి కొత్త మార్పు ఏమిటంటే, ఏ బ్యాంకులకు మనం పేమెంట్ చేయాల్సి ఉంటుందో, ఆ బ్యాంకులు తమ కస్టమర్లకు ముందే సమాచారం ఇవ్వాలి.
పేమెంట్ డ్యూ డేట్‌కి ముందే కస్టమర్‌కి ఇదిగో, ఇంత అమౌంట్ మీరు కట్టాల్సి ఉంది, మేం పేమెంట్ కట్ చేసుకుంటున్నాం అంటూ సదరు బ్యాంక్ ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే కస్టమర్ అనుమతితోనే తాము ఇలా కట్ చేసుకున్నట్లు ఓ రూల్ ఫాలో అవడం అన్నమాట.
ఇందుకోసం బ్యాంక్ నుంచి కస్టమర్‌కి ఓటిపి వెళ్తుంది వన్ టైమ్ పాస్ వర్డ్ ఆ పాస్‌వర్డ్ కస్టమర్ బ్యాంక్‌కి తెలపగానే, ఆ డ్యూ అమౌంట్ కట్ అవుతుంది. అంటే కస్టమర్ల పూర్తి అనుమతి, విచక్షణతోనే ఆ లావాదేవీ పూర్తైనట్లు ధృవీకరించబడుతుంది. ఐతే ఈ OTP విధానం రూ.5000దాటిన పేమెంట్లకు వర్తిస్తుంది. మిగిలిన మొత్తాలకు సమాచారం చేరవేస్తారని తెలుస్తోంది.
ఐతే ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌కి బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు ఇంకా సిద్ధం కాలేదు. దీంతో రేపు లావాదేవీలు చాలా డిస్ట్రబ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే పేమెంట్స్ కౌన్సిల్ ఆప్ ఇండియా కొత్త నిబంధనల అమలును మరో నెల రోజులపాటు వాయిదా వేయాల్సిందిగా కోరింది.
NEW
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com