Ayodhya: రాములోరి విగ్రహం కోసం అరుదైన సాలిగ్రామాలు

Ayodhya: రాములోరి విగ్రహం కోసం అరుదైన సాలిగ్రామాలు
నేపాల్ నుంచి అయోధ్య చేరనున్న అరుదైన సాలిగ్రామాలు; ఆరు కోట్ల సంవత్సరాల నాటి అరుదైన రాతితో రాములోరి విగ్రహం...

అయోధ్య రామ మందిర నిర్మాణం అణువణువుగా భక్తులను పులకింపజేస్తూనే ఉంది. తాజాగా రాములోరి విగ్రహం కోసం అత్యంత అరుదైన రెండు సాలిగ్రామాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఈ భారీ సాలిగ్రామాలతో రాములోరి విగ్రహాన్ని చెక్కనున్నారని అధికారులు వెల్లడించారు. ఆలయ ప్రధాన అర్చకులు నేడు సాలిగ్రామాలకు పూజలు నిర్వించి వాటిని దేవ శిలలుగా మార్చనున్నారు. 6 కోట్ల సంవత్సరాల పూరాతనమైన ఈ అరుదైన సాలిగ్రామాలను రెండు ట్రక్కుల్లో నేపాల్ నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ రాళ్లతో రాముని విగ్రహం కూర్చి.. రామమందిరంలో ప్రతిష్ఠించబోతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story