దానంలో కలియుగ కర్ణుడు.. రోజుకు రూ.22 కోట్లు దానం

దానంలో కలియుగ కర్ణుడు.. రోజుకు రూ.22 కోట్లు దానం
X
విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ భారతదేశంలో పరోపకారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.

75 ఏళ్ల అజీమ్ ప్రేమ్‌జీ కూరగాయల నూనెను తయారుచేసే సంస్థ నుండి విప్రోను వైవిధ్యభరితమైన సమ్మేళనంగా మార్చారు. భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన అజీమ్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని దాతృత్వ సంస్ధలకు విరాళంగా ఇచ్చారు. 7,904 కోట్ల విరాళంతో, విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ భారతదేశంలో పరోపకారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అతను 2019 లో రోజుకు సుమారు రూ. 22 కోట్లు విరాళంగా ఇచ్చారని ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంథ్ర పీ లిస్ట్ వెల్డించింది. హెచ్‌సిఎల్‌కు చెందిన శివ నాదర్ (75) రూ .795 కోట్ల విరాళంతో రెండో స్థానంలో ఉన్నారు.

2018-19లో రూ.826 కోట్లకు నమోదైన నాడార్ విరాళం ఈసారి రూ.795 కోట్లు, 2018-19లో ప్రేమ్‌జీ రూ.426 కోట్ల విరాళంతో రెండో స్థానంలో ఉన్నారు. భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ రూ.458 కోట్ల విరాళాలతో ఈసారి మూడో స్థానంలో కొనసాగారు.

ఎడెల్గిన్ విడుదల చేసిన దాన కర్ణుల జాబితాలో వ్యక్తులు ఇచ్చిన మొత్తం విరాళాలు 175 శాతం పెరిగి రూ.12,050 కోట్లకు చేరుకున్నాయి. రూ.10 కోట్లకు పైగా దానం చేసిన వారి సంఖ్య 72 నుంచి 78కి పెరిగింది. లిస్ట్‌లోని 109 మంది రూ.5 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారు.

మొత్తం ఏడుగురు మహిళలకు చోటు లభించింది. గత ఆర్థిక సంవత్సరంలో నందన్ నీలేకని రూ.159 కోట్లు, ఎస్ గోపాలకృష్ణన్ రూ.50 కోట్లు, ఎస్‌డీ శిబులాల్ రూ.32 కోట్లు విరాళమిచ్చారు. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకులు బిన్నీ బన్సల్ రూ.5.3 కోట్లు దానం చేశారు. 37 ఏళ్ల బన్సల్.. ఈ జాబితాలోని దాతలందరిలోకెల్లా పిన్న వయస్కుడు.

Tags

Next Story