నెటిజన్ల సాయం.. బాబా కా ధాబాకి 'రెస్టారెంట్' రూపం

నెటిజన్ల సాయం.. బాబా కా ధాబాకి రెస్టారెంట్ రూపం
X
ముదిమి వయసులో ఎవరి మీదా ఆధారపడకుండా కష్టపడుతున్న ఆ వృద్ధ దంపతులకు మేమున్నామంటూ తలో చెయ్యి వేసి బాబా కా ధాబా రూపు రేఖలు

మనసున్న మారాజులంతా సాయం చేశారు. ముదిమి వయసులో ఎవరి మీదా ఆధారపడకుండా కష్టపడుతున్న ఆ వృద్ధ దంపతులకు మేమున్నామంటూ తలో చెయ్యి వేసి బాబా కా ధాబా రూపు రేఖలు మార్చి రెస్టారెంట్‌కి రూపకల్పన చేశారు. బాబా కా ధాబా యజమాని కాంత ప్రసాద్ ఢిల్లీలో కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

కాంటా ప్రసాద్ రెస్టారెంట్ ఎక్కడ ఉంది?

బాబా కా ధాబా యొక్క 80 ఏళ్ల యజమాని తన రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ ఉన్న ప్రాంతమైన మాల్వియా నగర్ లోని తన రెస్టారెంట్ ను ప్రారంభించారు. తన రెస్టారెంట్‌లో భారతీయ మరియు చైనీస్ వంటకాలు వడ్డిస్తామని కాంత ప్రసాద్ తెలిపారు.

"మేము చాలా సంతోషంగా ఉన్నాము. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ప్రజలు చేసిన సహాయానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా రెస్టారెంట్‌ను సందర్శించాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఇక్కడ భారతీయ వంటకాలతో పాటు చైనీస్ వంటకాలను అందిస్తాము" అని కాంత ప్రసాద్ చెప్పారు.

బాబా కా ధాబా అంటే ఏమిటి?

మాల్వియా నగర్‌లో ఉన్న బాబా కా ధాబా గత 30 సంవత్సరాల నుండి వృద్ధ దంపతులు - కాంత ప్రసాద్ అతని భార్య బాదామి దేవి చేత నిర్వహించబడుతున్న ఒక చిన్న టిఫిన్ సెంటర్. కరోనా సీజన్, లాక్డౌన్లో బిజినెస్ లేదు.. పూట గడవడం కష్టంగా మారింది. ఒకరి దగ్గర చేయి చాచలేని ఆ వృద్ధ దంపతులు ఓపిక ఉన్నంత వరకు పని చేయాలనుకున్నారు.. దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు ఫలించాయి.

ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ అక్టోబర్లో బాబా కా ధబాను సందర్శించి, దాని క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. చిన్న వీడియోలో, కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో తినుబండారాలు నడుపుతున్నప్పుడు తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కంతా ప్రసాద్ కన్నీళ్లతో మొరపెట్టుకున్నాడు.

వెంటనే వసుంధర తంఖా శర్మ అనే ఓ నెటిజన్ ఈ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసి, బాబా కా ధాబాను సందర్శించాలని రాజధాని పౌరులను అభ్యర్థించారు. అదే వారికి మనం ఇచ్చే విరాళం అని నెటిజన్లలో స్ఫూర్తి నింపింది. అది కాస్తా వైరల్ అయింది. పెద్ద మనసున్న నెటిజన్లు చలించి పోయారు. చేతనైనంత సాయం చేయాలని ముందుకొచ్చారు. బాబా కా ధాబాకు విరాళాల వరద వెల్లువెత్తింది. ఇప్పుడు ఆ ధాబా రెస్టారెంట్‌గా మారింది.

Tags

Next Story