16 Sep 2020 12:31 PM GMT

Home
 / 
జాతీయం / 28 ఏళ్ల నాటి బాబ్రీ...

28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
X

ఈ నెల 30వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు వెలువడనుంది.. దేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చివేసిన 28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ దిగ్గజ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతి సహా నిందితులందరూ కోర్టుకు హాజరు కావాలని.. తీర్పును వెల్లడించనున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి ఎస్‌కే యాదవ్‌ ఇప్పటికే కోరారు.

1992లో బాబ్రీ మసీదు ధ్వంసానికి దారితీసేలా కుట్రపూరితంగా వ్యవహరించారని బీజేపీ దిగ్గజ నేతలపై ఆరోపణలున్నాయి. రాముడి జన్మస్థలంలో మసీదు ఉందని నమ్మడంతో కరసేవకులు ఈ కట్టడాన్ని నేలమట్టం చేశారు. బాబ్రీ కూల్చివేతపై 92 ఏళ్ల అద్వానీ జులై 24న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీబీఐ ప్రత్యేక న్యాయస్దానం ఎదుట స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అంతకుముందు రోజు 86 ఏళ్ల మురళీ మనోహర్‌ జోషీ తన స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. తమపై నమోదైన అన్ని అభియోగాలను వారు తోసిపుచ్చారు. ఇక బాబ్రీ కేసులో న్యాయస్ధానం ఎలాంటి తీర్పు వెలువరించినా ఇబ్బంది లేదని బీజేపీ సీనియర్‌ నేత ఉమా భారతి స్పష్టం చేశారు.

Next Story