Uttar Pradesh: 65 ఏళ్ల వయసులో రూ. 17 లక్షల ఆదాయం..

Uttar Pradesh: ప్రస్తుతం నడుస్తున్న 3జీ కాలంలో వ్యవసాయంతో కూడా అద్భుతాలు చేయొచ్చు అని ఇప్పటికీ ఎంతోమంది నిరూపించారు. అంతే కాకుండా ఆ అద్భుతాలతో చేతినిండా సంపాదించవచ్చని కూడా తెలిసేలా చేసారు. అందుకే ఎల్‌ఎల్‌బీ చదివినా కూడా తనన ఊరికి వచ్చి వ్యవసాయం చేసి తాను పెట్టిన పెట్టుబడికి 4 రెట్లు లాభాన్ని పొందగలిగాడు ఈ వృద్ధుడు.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని లఖింపూర్ ఖేరి(Lakhimpur kheri)కి చెందిన సాకేతు గ్రామంలో నివసిస్తున్న 65 యేళ్ల సురేశ్ చంద్ర వర్మ బీఏ, ఎల్‌ఎల్‌బీ చదువుకున్నాడు. వ్యవసాయం మీద ఇష్టంతో ఉద్యోగం మానేసి పూర్తిగానే దానిపైనే దృష్టి పెట్టాడు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో రకరకాల పంటలు పండించడం మొదలుపెట్టాడు. మెల్లగా మామిడి, ఉసిరి, లీచీ, నిమ్మ, చెరకు, వరి, గోధుమ వంటి పంటలు పండించడంలో ఆరితేరాడు. వాటి ద్వారానే ఎంతో లాభాన్ని వెనకేసుకున్నాడు.
అయితే నాలుగేళ్లు క్రితం తాను వెదురు మొక్కలను కొని తన భూమిలో నాటాడు. అప్పటినుండి ఇప్పటికీ వాటి విలువ చాలా పెరిగింది. ప్రస్తుతం అవి దున్నడానికి అనువుగా మారాయి. ప్రతి మొక్కకు 40 నుంచి 50 వరకు వెదురు వచ్చే అవకాశం ఉంది. పల్లెటూరులో ఒక వెదురు బొంగు రూ.150 పలుకుతుంది. ఈ విధంగా ప్రతి మొక్కకు 50 వెదుర్లు ఉత్పత్తి అయితే 234 మొక్కలకు 11 వేల 7 వందల వెదుర్లు వస్తాయి. ఒక వెదురును రూ.150లకు అమ్మితే మొత్తంగా రూ. 17 లక్షల 55 వేలు లాభం చేతికొస్తుంది. వెదురుతో బిజినెస్ చేయొచ్చని, వాటితో కూడా లక్షల్లో లాభాలు వెనకేసుకోవచ్చని ఈ చదువుకున్న నిరూపించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com