Vijaya Laxmi : అలయ్ బలయ్ కార్యక్రమం... దత్తాత్రేయ కూతురు రాజకీయ ఆరంగ్రేటం..!

Vijaya Laxmi :రాజకీయాల్లో వరసత్వాలు కామన్. తల్లి, తండ్రుల బాటలో ఆయా పార్టీలో చేరి తమ సత్తా చాటుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇదే బాటలో రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని ప్రస్తుతం హర్యానా రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి గ్రాండ్‌గా తెరమీదకు రాబోతున్నారు. ఇందుకు దత్తన్న ఎంతో ఇష్టంగా నిర్వహించుకునే అలయ్ బలయ్ కార్యక్రమం వేదికకానుంది. ఇన్నాళ్లు గవర్నర్ దత్తాత్రేయనే స్వయంగా మాట్లాడి అలయ్ బలయ్‌కు రావాలంటూ పార్టీలకు అతీతంగా ఆహ్వానించే వారు. దసరా వచ్చిందంటే చాలు దత్తాత్రేయ చేసే ఈ కార్యక్రమం కోసం ఎదురు చూసేవారు ఎందరో. కళాకారులతో పాటు రాజకీయ పార్టీ నేతలు సైతం పాల్గొనేవారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించే ఈ కార్యక్రమానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది.
నిత్యం పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనే నేతలు కూడా ఈ అలయ్ బలయ్ కార్యక్రమంలో అన్ని మరచిపోయి ఉత్సాహంగా పాల్గొంటారు. దత్తాత్రేయ కూతురు రాజకీయ తెరంగ్రేటానికి ఈ అలయ్ బలయ్ వేదిక కాబోతోంది. ప్రస్తుతం దత్తాత్రేయ హర్యానా గవర్నర్‌గా ఉండటంతో ఈ కార్యక్రమ ఏర్పాట్లను అన్నీ తానై చూసుకుంటోంది విజయ లక్ష్మి. అలయ్ బలయ్‌కు సంభందించిన సభ ఏర్పాట్లు, రాజకీయ పార్టీ నేతలకు, ఇతర ముఖ్యమైన వారికి ఇన్విటేషన్లు ఇచ్చేందుకు స్వయంగా తానే వెళ్తోంది. దీంతో విజయ లక్ష్మి రాజకీయ తెరారంగ్రేటానికి సమయం ఆసన్నమైందన్న చర్చ ప్రారంభమైంది. అయితే తాను మాత్రం క్షేత్ర స్థాయి నుండి పనిచేసుకుంటూ పోతానని.. పదువులపై తనకు ఆశలు లేవని.. తన పనితాను చేసుకుంటూ పోతానంటోంది.
రాజకీయాలకు అతీతంగా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం దత్తాత్రేయ కూతురు విజయ లక్ష్మి రాజకీయ ఆరంగ్రేటం చేయనున్నారు. అయితే తండ్రికి తగ్గ తనయిగా ఎదుగుతుందా.. ఉన్నత పదవులు అదిరోహిస్తుందో లేదో? చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com