Bangalore: విషాదం.. మెట్రో పిల్లర్‌ కూలి తల్లీ, కొడుకు మృతి

Bangalore: విషాదం.. మెట్రో పిల్లర్‌ కూలి తల్లీ, కొడుకు మృతి
Bangalore: ఒక్కోసారి మనతప్పేమీ ఉండదు.. అయినా మృత్యువు మన వెన్నంటే ఉండి పట్టుకుపోతుంది.

Bangalore: ఒక్కోసారి మనతప్పేమీ ఉండదు.. అయినా మృత్యువు మన వెన్నంటే ఉండి పట్టుకుపోతుంది. భార్యాభర్తలు తమ కవల పిల్లలతో కలిసి బైక్ మీద వెళుతున్నారు. మార్గమధ్యంలో మెట్రో పిల్లర్ కూలి వారి మీద పడింది. అంతే.. తల్లీ కొడుకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు..


కర్ణాటకలోని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ అటుగా వెళుతున్న ద్విచక్ర వాహనంపై పడటంతో మహిళ, ఆమె రెండున్నరేళ్ల కుమారుడు మరణించారు. ఆమె భర్త మరియు కుమార్తెలకు గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బెంగళూరులోని నాగవర ప్రాంతంలో జరిగింది.


దంపతులు వారి కవల పిల్లలు - ఒక కుమార్తె, ఒక కుమారుడు కలిసి బైక్‌పై వెళుతుండగా, మెట్రో పిల్లర్‌కు చెందిన ఇనుప స్తంభం విరిగి వారిపై పడిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో తేజస్వని, ఆమె కుమారుడు విహాన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని బాటసారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.


తేజస్విని భర్త లోహిత్, కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిద్దరూ హెల్మెట్ ధరించి ఉన్నారని పోలీసులు తెలిపారు. లోహపు కడ్డీలతో చేసిన స్తంభం దాదాపు 40 అడుగుల పొడవు ఉంది. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హామీ ఇచ్చారు. పిల్లర్ కూలిపోవడానికి గల కారణాలను గుర్తించి పరిహారం అందజేస్తామని అన్నారు. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story