Bank Holidays: బ్యాంకు పన్లేమైనా ఉంటే ఈ రోజే చూస్కోండి.. వరుసగా నాలుగు రోజులు..

Bank Holidays: బ్యాంకు పన్లేమైనా ఉంటే ఈ రోజే చూస్కోండి.. వరుసగా నాలుగు రోజులు..
Bank Holidays: రేపటి నుంచి బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూత పడే అవకాశం ఉంది.

మార్చి నెలలో బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. రేపటి నుండి (మార్చి 13) వరుసగా రెండు రోజుల పాటు సెలవులు.. ఆ తర్వాత మరో రెండు రోజులు బ్యాంకు యాజమాన్యం సమ్మె కారణంగా కస్టమర్లకు తమ సేవలు అందించేందుకు వీలుపడదు. ఈ నేపథ్యంలో మొత్తంగా నాలుగు రోజుల పాటు బ్యాంకు బంద్ అవుతుంది.

బ్యాంకు పని ఏదైనా ఉంటే రేపు చేయొచ్చులే అని వాయిదా వేసుకోవడానికి లేదు. ఈ రోజే ఆ పని పూర్తి చేసుకుంటే మంచిది. రేపటి నుండి మంగళవారం వరకు బ్రాంచీలు తెరిచి ఉండకపోవచ్చు. మార్చి 13 రెండో శనివారం, ఆ మరుసటి రోజు ఆదివారం, ఆ తర్వాత వచ్చే సోమ, మంగళవారాలు బ్యాంకుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.

ఆదివారం నాటికి యూనియన్లు సమ్మె విరమించుకోని పక్షంలో బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూసి ఉంటాయి. ఈ నాలుగు రోజుల్లో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. కాగా ఆర్బీఐ ప్రకటించిన హాలిడే క్యాలెండర్ ప్రకారం మార్చిలో 5,11,22,29,30 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.

Tags

Read MoreRead Less
Next Story