Bank Holidays in January 2022: జనవరి నెలలో ఎన్ని సెలవులో..

Bank Holidays in January 2022: జనవరి నెలలో ఎన్ని సెలవులో..
Bank Holidays in January 2022: 2021 సంవత్సరం ముగియబోతోంది 2022లోకి ప్రవేశించబోతున్నాము. జనవరి 2022 నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులో తెలుసుకోవడం కస్టమర్లందరికీ ముఖ్యం.

Bank Holidays in January 2022: 2021 సంవత్సరం ముగియబోతోంది 2022లోకి ప్రవేశించబోతున్నాము. జనవరి 2022 నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులో తెలుసుకోవడం కస్టమర్లందరికీ ముఖ్యం. తద్వారా వారి బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది.

రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) జాబితాను విడుదల చేసింది. బ్యాంకు సెలవులు తొమ్మిది రోజులు బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావితం చూపుతాయి. 2022 జనవరి నెలలో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు మూసివేయబడతాయి.

అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులు జనవరి 2022లో 16 రోజుల పాటు మూసివేయబడతాయి. అయితే మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్‌లైన్ సేవలు సెలవు దినాల్లో కూడా కొనసాగుతాయని గుర్తుంచుకోవాలి.

బ్యాంకింగ్ సేవలు ఎలా ప్రభావితమవుతాయి?

బ్యాంకులు మూసివేయబడినప్పుడు, ఖాతాదారులు తమ బ్యాంకు శాఖలలో డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి కానీ, డిపాజిట్ చేసుకోవడానికి కానీ వీలు పడదు. కానీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు ఏటీఎమ్ సేవలు అందుబాటులో ఉంటాయి.

ప్రాంతీయ సెలవులను నిర్ణయించడం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నందున బ్యాంకులు అన్నీ 16 రోజుల పాటు తమ కార్యకలాపాలను మూసివేయవు. భారతదేశంలోని బ్యాంకులు గణతంత్ర దినోత్సవం (జనవరి 26), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2), క్రిస్మస్ (డిసెంబర్ 25) సెలవులను కచ్చితంగా పాటిస్తాయి. ప్రతి రాష్ట్రానికి, బ్యాంకు సెలవులు వేర్వేరుగా ఉంటాయి.

జనవరి 2022లో బ్యాంకు సెలవుల జాబితా

జనవరి 1 కొత్త సంవత్సరం భారతదేశం అంతటా

జనవరి 2 ఆదివారం

జనవరి 4 లూసాంగ్ సిక్కిం

జనవరి 8 రెండవ శనివారం

జనవరి 9 ఆదివారం

జనవరి 11 మిషనరీ డే మిజోరం

జనవరి 12 స్వామి వివేకానంద జననం కోల్‌కతా

జనవరి 14 మకర సంక్రాంతి అనేక రాష్ట్రాలు

జనవరి 15 పొంగల్ తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్

జనవరి 16 ఆదివారం

జనవరి 18 థాయ్ పూసం చెన్నై

జనవరి 22 నాల్గవ శనివారం

జనవరి 23 ఆదివారం

జనవరి 26 గణతంత్ర దినోత్సవం దేశమంతటా

జనవరి 30 ఆదివారం

జనవరి 31 మీ-డ్యామ్-మీ-ఫై అస్సాం

RBI సెలవులను ఎలా మంజూరు చేస్తుంది?

సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్ సెలవుల జాబితాను మూడు కేటగిరీల క్రింద ఇస్తుంది. ఈ మూడు కేటగిరీలలో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవు, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేతో పాటు బ్యాంకుల ఖాతాలను మూసివేయడం వంటివి ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story