Alert : 2021లో 100 రోజులు బ్యాంకులకు సెలవులు!
ప్రస్తుతం బ్యాంకు ఎకౌంటు లేని వాళ్ళంటూ ఎవరు లేరు. ఒక్కొక్కరికి 10 బ్యాంకుల్లో ఖాతాలు కూడా ఉన్నాయి. రోజువారీ జీవితంలో బ్యాంకు లావాదేవీలు అనేవి తప్పనిసరి అయిపోయాయి. అయితే ఎప్పుడు బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఎప్పుడు మూసేసి ఉంటాయో తెలుసుకొని ఉండాలి. అయితే వచ్చే ఏడాది (2021)లో రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు, జాతీయ సెలవులు అన్నీ కలిపి మొత్తం బ్యాంకులకు 100 రోజులు సెలవులు వస్తున్నాయి.
ఈ సెలవులకి అనుగుణంగా బ్యాంకులకి సంబంధించిన లావాదేవీలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన అధికారిక వెబ్‌సైట్‌లో సెలవులను అప్‌డేట్ చేస్తుంది. అయితే ఈ సెలవులు రాష్ట్రానికి. రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. 2021 హైదరాబాద్ రీజియన్‌లో బ్యాంకులకు ఎప్పుడు సెలవులు ఉంటాయో ఆర్బీఐ ప్రకటించింది.
ఇందులో రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు, పబ్లిక్ హాలిడేస్ కలిపి 2021లో మొత్తం 100 సెలవులు ఉన్నాయి. నెలల వారీగా లిస్టు ఇలా ఉంది.
జనవరి
జనవరి 14 (గురువారం)- మకర సంక్రాంతి, జనవరి 26 (మంగళవారం)- రిపబ్లిక్ డే
మార్చి
మార్చి 11 (గురువారం)- మహా శివరాత్రి, మార్చి 29 (సోమవారం)- హోలీ
ఏప్రిల్
ఏప్రిల్ 1 (గురువారం)- అకౌంట్స్ క్లోజింగ్ డే, ఏప్రిల్ 2 (శుక్రవారం)- గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 5 (సోమవారం)- బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 13 (మంగళవారం)- ఉగాది, ఏప్రిల్ 14 (బుధవారం)- అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 21 (బుధవారం)- శ్రీరామనవమి
మే
మే 1 (శనివారం)- కార్మికుల దినోత్సవం, మే 14 (శుక్రవారం)- రంజాన్
జూలై
జూలై 11 (ఆదివారం)- బోనాలు, జూలై 21 (బుధవారం)- బక్రీద్
ఆగస్టు
ఆగస్టు 19 (గురువారం)- మొహర్రం, ఆగస్టు 31 (సోమవారం)- కృష్ణాష్టమి,
సెప్టెంబర్
సెప్టెంబర్ 10 (శుక్రవారం)-వినాయక చవితి
అక్టోబర్
అక్టోబర్ 2 (శనివారం)- గాంధీజయంతి, అక్టోబర్ 6 (బుధవారం)-బతుకమ్మ , అక్టోబర్ 13 (బుధవారం)-మహా అష్టమి, అక్టోబర్ 15 (శుక్రవారం) విజయదశమి, అక్టోబర్ 18 (సోమవారం)- మిలాద్ ఉన్ నబీ
నవంబర్
నవంబర్ 4 (గురువారం)- దీపావళి, నవంబర్ 19 (శుక్రవారం)- గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి
డిసెంబర్
డిసెంబర్ 25 (శనివారం)- క్రిస్మస్
వీటికి తోడుగా రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు, నేషనల్ హాలిడేస్ కూడా ఉంటాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com