ఈ నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు.. లిస్ట్ ఇదే!

Bank Holidays September 2021: ప్రజలు తమ ఆర్థిక లావాదేవీలు అన్ని బ్యాంకుల ద్వారానే చేస్తుంటారు. అకౌంట్లో నగదు భద్రపరుచుకోవడం, నగదు బదిలీ, చెక్ బుక్స్, ఉద్యోగుల జీతాలు అన్ని బ్యాంకుల ద్వారానే కొనసాగిస్తుంటారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో బ్యాంకులు పాత్ర కీలకంగా మారింది. అయితే బ్యాంక్ లో ఖాతా ఉన్నవారు ఏయే తేదీల్లో బ్యాంక్ లు పని చేస్తాయో తెలుసుకుని ఆ మేరకు ప్రణాళికలు వేసుకోటానికి వీలుంటుంది. లేదంటే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆయా రాష్ట్రాల్లో పండుగలకు అనుగుణంగా బ్యాంకులకు 12 రోజుల సెలవులు ప్రకటించింది. మూడు కేటగిరీల్లో బ్యాంకుల సెలవుల్లో ప్రకటించింది. నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్స్ క్లోసింగ్ ఆఫ్ అకౌంట్స్ ఈ కేటగిరీలు ప్రకటించింది. మొదటి కేటగిరీ కింద సాధారణ సెలవులు వర్తింపజేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయానికొస్తే 7 రోజులు మాత్రమే బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి.
బ్యాంకుల సాధారణ సెలవులు
సెప్టెంబర్ 5 – ఆదివారం,
సెప్టెంబర్ 11 – రెండవ శనివారం,
సెప్టెంబర్ 12 – ఆదివారం,
సెప్టెంబర్ 19 – ఆదివారం,
సెప్టెంబర్ 25 – నాల్గవ శనివారం,
సెప్టెంబర్ 26 – ఆదివారం
ప్రత్యేక సెలవులు
సెప్టెంబర్ 8 తిథి ఆఫ్ శ్రీమంత శంకర్‌దేవ (అస్సాంలో సెలవు)
సెప్టెంబర్ 9 తీజ్(హరిటలికా) (సిక్కీంలో సెలవు)
సెప్టెంబర్ 10 వినాయక చవితి
సెప్టెంబర్ 11 గణేశ్ చతుర్థి (2వరోజు)
సెప్టెంబర్ 17 కర్మ పూజ (గోవా)
సెప్టెంబర్ 20 ఇంద్రజాతర (సిక్కీం)
సెప్టెంబర్ 21 శ్రీ నారాయణ గురు సమాధి డే (కేరళ)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com