Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా తిరంగా డిపాజిట్ పథకం.. రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీలో రూ.1.28 వేలు

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా బరోడా తిరంగా డిపాజిట్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వినియోగదారులకు అధిక వడ్డి రేటుతో డిపాజిట్ స్కీమ్‌ను అందిస్తుంది. 6 శాతం వరకు అత్యధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తోంది.
2022 డిసెంబర్ 31 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కె. ఖురానా ఒక ప్రకటనలో తెలిపారు. రూ.2 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ అందుతుంది.
ఈ స్కీమ్ ప్రకారం.. 555 రోజుల కాలవ్యవధికి డిపాజిట్పై 6.15 శాతం వడ్డీని పొందవచ్చు. ఇందులో సీనియర్ సిటిజన్లకు 0.5 శాతం అదనపు వడ్డీని, నాన్ కాలబుల్ డిపాజిట్లకు 0.15 శాతం అదనపు వడ్డీని అందిస్తారు. అంటే సీనియర్ సిటిజన్లకు 555 రోజుల డిపాజిట్‌పై 6.65 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.
ఉదాహరణకు రూ. 1 లక్ష డిపాజిట్ చేస్తే 555 రోజుల మెచ్యూరిటీ కాలంలో రూ.1.26 లక్షల కంటే ఎక్కువే పొందే అవకాశం ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే మెచ్యూరిటీ మొత్తం రూ.1.28 లక్షలకు పైగానే అందుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com