అలర్ట్ : వచ్చే ఏడాది జనవరిలో బ్యాంకులకి 14 రోజులు సెలవులు!

అలర్ట్ :   వచ్చే ఏడాది జనవరిలో బ్యాంకులకి 14 రోజులు సెలవులు!
చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి, వినియోగదారులు తమ లావాదేవీలకి సంబంధించిన పనులను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

January 2021 Bank Holidays : వచ్చే ఏడాది (2021) జనవరి ( January 2021)నెలలో 14 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. వీటిలో నాలుగు ఆదివారాలతో పాటు రెండవ మరియు నాల్గవ శనివారాలు మరియు ఒక జాతీయ సెలవుదినం ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ )(Reserve Bank of India) ప్రకారం, ఈ సెలవులు రాష్ట్రానికి రాష్ట్రానికి భిన్నంగా ఉండవచ్చు. చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి, వినియోగదారులు తమ లావాదేవీలకి సంబంధించిన పనులను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. బ్యాంకులు మూసివేయబడినప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ ( mobile and internet banking )ద్వారా బ్యాంక్ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. కాగా, ఈ ఏడాది మొత్తం 40 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ జాబితాను విడుదల చేసింది.వచ్చే ఏడాది జనవరిలో బ్యాంకులకి 14 రోజులు సెలవులు!

జనవరిలో బ్యాంక్ హాలిడేస్ ఇవే!

01 జనవరి 2021- నూతన సంవత్సర దినోత్సవం

03 జనవరి 2021- మొదటి ఆదివారం

09 జనవరి 2021- రెండవ శనివారం

10 జనవరి 2021- రెండవ ఆదివారం

17 జనవరి 2021- మూడవ ఆదివారం

23 జనవరి 2021- నాల్గవ శనివారం

24 జనవరి 2021- నాలుగో ఆదివారం

26 జనవరి 2021- గణతంత్ర దినోత్సవం

31 జనవరి 2021- అయిదవ ఆదివారం

ప్రాంతీయ సెలవులు

02 జనవరి 2021 : నూతన సంవత్సర వేడుక

14 జనవరి 2021 : మకర సంక్రాంతి / పొంగల్ / మాఘే సంక్రాంతి

15 జనవరి 2021: తిరువల్లూవర్ డే / మాగ్ బిహు మరియు తుసు పూజ

16 జనవరి 2021: ఉజవర్ తిరునాల్

23 జనవరి 2021: నేతాజీ సుభాస్ చంద్రబోస్ పుట్టినరోజు

25 జనవరి 2021: ఇమోయిను ఇరత్పా

26 జనవరి 2021: గాన్-న్గై

Tags

Read MoreRead Less
Next Story