ఈ బ్యాడ్(బడా) బాబుల లోన్లు రద్దు విలువెంతో తెలుసా? ఓ రాష్ట్రాన్ని ఏడాదిపాటు మెయిన్‌టైన్ చేయొచ్చు!

ఈ బ్యాడ్(బడా) బాబుల లోన్లు రద్దు విలువెంతో తెలుసా? ఓ రాష్ట్రాన్ని ఏడాదిపాటు మెయిన్‌టైన్ చేయొచ్చు!
రైతులు రుణాలు తీసుకుని ఈఎంఐలు కట్టకపోతే, వేలంపాట వేసేస్తారు. ఫోటోలు బ్యాంకులలో, అప్పుడప్పుడూ పేపర్లలో కూడా పబ్లిష్ చేస్తారు.

బ్యాంకులకు మీరు ఓ వంద రూపాయలు అప్పు ఉంటే చూడండి..ఎలా పీడిస్తాయో తెలుసా..ఏడాది తిరిగేలోపు మీ అదే వందరూపాయల అప్పు కనీసం అన్ని వడ్డీలు వేసి వెయ్యి రూపాయలు చేస్తుంది. అదే మీరు వెయ్యి రూపాయలు బ్యాంక్ అక్కౌంట్‌లో ఉంచితే, ఏ లావాదేవీ చేయకపోయినా సరే, ఆ వెయ్యీ మాయమైపోతాయ్( ఎస్ఎంఎస్ ఛార్జ్, మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జ్, జిఎస్టీ, ఏటిఎం మెయిన్‌టెనెన్స్ ఛార్జీలు ఇలా బోలెడు ఛార్జీల పేరుతో మొత్తం మాయం) ఇది మామూలు కస్టమర్ల సంగతి..మరి ఇదే రైతులు, ఇతరత్రా రుణాలు తీసుకుని ఈఎంఐలు కట్టకపోతే, వేలంపాట వేసేస్తారు. ఫోటోలు బ్యాంకులలో,,అప్పుడప్పుడూ పేపర్లలో కూడా పబ్లిష్ చేస్తారు. కానీ అదే పెద్ద రుణాలు..అంటే కోట్లకి కోట్లు వాళ్ల గుడ్‌విల్‌ని బట్టి ఇచ్చే లోన్ల విషయంలో ఏం చేస్తాయంటే..జస్ట్ నోటీసులు ఇస్తాయ్..అప్పటికీ వినకపోతే ఆ ఖాతాలను మూసేస్తాయంతే..!

వాస్తవంగా జరిగేది ఇదే..బ్యాంకులు వీటికే రైటాఫ్ అని పేరు పెట్టుకుంటాయ్. మొండిబకాయిలుగా పిలిచే బ్యాడ్(బడా)బాబుల లోన్లు అన్నిటికీ ఇదే తీరులో సాంకేతికరద్దు పద్దుగా చేసేస్తున్నారు. అలా బ్యాంకులు గత 9నెలలుగా ఎంత మేర రైటాఫ్ చేసాయో తెలిస్తే గుండెలు బాదుకోకతప్పదు. అక్షరాలా లక్షా15వేల కోట్లరూపాయల రుణాలను రద్దు చేసినట్లుగా సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది.

పైగా దీనికి ఆర్బీఐ గైడ్‌లైన్స్, బ్యాంకుల బోర్డులు అన్నీ అంగీకారంతో నిబంధనల మేరకే ఈ తంతు చేసినట్లు చెప్పారు. ఢిల్లీ ఆర్థిక బడ్జెట్ 65వేల కోట్ల రూపాయలు. ఏపీ బడ్జెట్ రెండులక్షల కోట్లు, తెలంగాణ కూడా ఓ లక్షన్నర కోట్లకి అటూ ఇటూగా ఉండొచ్చు..ఇవన్నీ కనీస అంచనాలు..అలాంటిది ఓ చిన్న రాష్ట్రం ఏడాదిపాటు నిర్వహించుకునే స్థాయిలో రుణాలను రద్దు చేయడమంటే చిన్న విషయంగా చూడాలా..?

షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకల రైటాఫ్ లోన్ల విలువ

2018-19 రూ.2,36,265కోట్లు

2019-20 రూ.2,34,170కోట్లు

2020-21 రూ.1,15,038కోట్లు( మొదటి 9 నెలలు)

పైగా వీటికి పరిష్కారంగా బ్యాడ్‌ బ్యాంక్ అని..అసెట్ రీకనస్ట్రక్షన్ కమిటీ అని, బ్యాంకులన్నిటినీ కలిపేస్తామంటూ విలీన ప్రక్రియలు చేపట్టడం చూస్తే, బ్యాంకింగ్ వ్యవస్థ ప్రత్యేకించి ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని బ్యూరోక్రసీ ఎంతగా కుళ్లిపోయిందో అర్ధం అవుతుంది. ఈ సమస్య ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు..ప్రతి ఏటా జరుగుతున్నా..మొండిబకాయిలు పుడుతున్నాయంటే లోపం ఎక్కడుంది..? ఇదే ప్రవేట్ రంగ బ్యాంకులు చూడండి, ఏ బడాబాబుకి లోన్ ఇచ్చినా..వాటిని రాబట్టుకునే తీరు కానీ, అసలు అప్పు ఇచ్చే విధానమే వేరుగా ఉంటుంది. ఈ మనుషులే ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనూ పని చేస్తారు. అక్కడ పని చేసే మనుషులే ప్రవేట్ రంగ బ్యాంకుల్లోకి వస్తే..ఎన్‌పిఏలు ఎందుకు తగ్గుతాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎందుకు పెరుగుతుంటాయి..?

కొస మెరుపు ఏమిటంటే, రైటాఫ్ లోన్లుగా పరిగణించిన అక్కౌంట్ హోల్డర్లు( బకాయిదారులు) తప్పకుండా పేమెంట్లు చేయాల్సిందేనని, అందుకు వాళ్లు బాధ్యులే అని రికవరీ పద్దతులు అన్నీ కొనసాగుతాయని ప్రకటించడం. అదే నిజంగా జరిగేట్లయితే, ఇక రైటాఫ్ చేయడమెందుకు. ఈ ప్రశ్న అడిగితే,బ్యాంకుల ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్లలో నష్టాలు తగ్గించేందుకు అని ఊరడింపు చేస్తారు. బొక్కని పూడ్చితే భర్తీ అవుతుంది కానీ, పైన కవర్ చేస్తే అసలు రంధ్రం లేకుండా పోతుందా..? అందుకే కదా ఈ దివాలాకోరు రుణాల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ పోతోంది.నిజంగా రికవరీ మెకానిజం అంటూ సరిగా పని చేస్తుంటే గత మూడేళ్లలో ఇలా రైటాఫ్ చేసిన లోన్లలో ఎంత మేరకు తిరిగి వసూలు చేయగలిగారో కూడా చూడండి

రైటాఫ్ చేసిన రుణాల్లో రికవరీ చేసినది రూ.3,68,636కోట్లు. అంటే గత రెండు సంవత్సరాల 9 నెలల కాలంలో మొత్తం రూ.5,85,443కోట్లు మేర రైటాఫ్ చేస్తే అందులో వసూలైంది ఇంతన్నమాట. ఇంకా మరో రెండున్నరలక్షల కోట్ల పై మాటే. దీన్ని సగం వసూలు చేసారు కాబట్టి గొప్పే అనుకుంటే పొరబాటే. ఈ లెక్కలు ఈ రెండున్నరేళ్లవే..మరి అంతకు కాలంలోని రైటాఫ్, రికవరీ లెక్కలు కూడా బయటపెడితేకానీ అసలు నిజం తేలదు

Tags

Read MoreRead Less
Next Story