కర్నాటక 20వ సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం

కర్నాటక 30వ సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. నిన్న బీజేఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన బసవరాజ్ బొమ్మై యడియూరప్ప వారసుడిగా ఇవాళ బాధ్యతలు చేపడుతున్నారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం తర్వాత మాజీ సీఎం యడియూరప్ప సహా ముఖ్యులంతా బసవరాజ్‌కు అభినందనలు తెలిపారు.
3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన.. 1960 జనవరి 1న జన్మించారు. తొలినాళ్లలో జేడీయూలో కీలకపాత్ర పోషించినా.. 2006లో బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. హవేరీ జిల్లా షిగ్గాం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. యడియూరప్ప కేబినెట్‌లో హోంమంత్రిగా పనిచేసారు. మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన బసవరాజ్ బొమ్మైకి సాగునీటిరంగంలో విశేష అనుభవం ఉంది. 1988-89లో కర్నాటక సీఎంగా చేసిన ఎస్సార్ బొమ్మై కుమారుడే బసవరాజ్ బొమ్మై.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com