జాతీయం

Pragya Thakur : మరోసారి వార్తల్లోకెక్కిన బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌

Pragya Thakur : మాలెగావ్‌ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రగ్యా ఠాకూర్‌ ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్‌పై బయటకు వచ్చారు

Pragya Thakur : మరోసారి వార్తల్లోకెక్కిన బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌
X

Pragya Thakur : BJP ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ మరోసారి వార్తాల్లో నిలిచారు. మాలెగావ్‌ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రగ్యా ఠాకూర్‌ ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్‌పై బయటకు వచ్చారు. ఐతే తాజాగా మధ్యప్రదేశ్‌ భోపాల్ శక్తినగర్ ఏరియాలోని ఓ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతూ కనిపించారు. గతంలో ఓ సారి ప్రగ్యా ఠాకూర్‌ డ్యాన్స్ చేసిన వీడియో, బాస్కెట్‌ బాల్ ఆడిన వీడియో వైరల్‌గా మారాయి. దీనిపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. 2008లో మాలెగావ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ పేలుళ్లలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి తీవ్రగాయాలయ్యాయి. 2017లో నేషనల్ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ప్రగ్యా ఠాకూర్‌కు బెయిల్ మంజూరు చేసింది. తర్వాత 2019 ఎన్నికల్లో బీజేపీ తరపున భోపాల్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు.

Next Story

RELATED STORIES