BBC : బీబీసీని నిషేధించాలన్న పిల్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు

BBC : బీబీసీని నిషేధించాలన్న పిల్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు
విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిష్పక్షపాతం లేని వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆరోపించింది


బీబీసీని నిషేధించాలని హిందూ సేన పిల్ వేయగా.. సుప్రీం కోర్టు కొట్టేసింది. సదరు మీడియా సంస్థను నిషేదించాలని కోర్టును ఎలా అడగగలరు అని ప్రశ్నించింది. హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా దాఖలు చేసిన పిల్ లో బీబీసీ ( బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్) భారత దేశానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ( 'ఇండియా ది మోదీ క్వశ్చన్' ) భారత దేశంపై విషప్రచారం చేయడంతో పాటు. దేశ ఎదుగుదలకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాన్ని నిర్వహిస్తుందని ఆరోపించారు.


గత నెలలో యూకేలో ప్రసారమైన డాక్యుమెంటరీ భారత్ లో పెద్ద దుమారాన్ని రేపింది. విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిస్పక్షపాతం లేని వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆరోపించింది. బీబీసీ డాక్యుమెంటరీ లింక్ లను బ్లాక్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను ప్రభుత్వం ఆదేశించింది. SFI విద్యార్థి సంఘం పలు యూనివర్సిటీలలో డాక్యుమెంటరీని ప్రదర్శించింది.

Tags

Read MoreRead Less
Next Story