BBC Documentary : "సుప్రీంకోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు"

BBC Documentary : సుప్రీంకోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు
సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రా, న్యాయవాది ప్రశాంత్ భూషన్


ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ సిరీస్ ను నిషేధించిన విషయం తెలిసిందే. నిషేధానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రా, న్యాయవాది ప్రశాంత్ భూషన్. ఈ విషయంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పంధించారు. గౌరవ కోర్టు విలువైన సమయాన్ని వృధా చేయడానికే పిటీషన్ వేశారని అన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. వేలమంది సాధారణ పౌరులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఇటువంటి పిటిషన్లు న్యాయ వ్యవస్థ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నాయని అన్నారు.

ప్రధాన మంత్రిపై బీబీసీ చేస్తున్న ప్రచారం భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను బలహీనపరిచే విధంగా ఉందని కేంద్ర న్యాయశాఖ ప్రతినిధి తెలిపారు. విదేశాలతో భారత్ కు ఉన్న స్నేహపూర్వక సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని కలిగించేవిగా ఉన్నాయని తెలిపారు. జనవరి 21న కేంద్ర ప్రభుత్వం బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించింది.

Tags

Read MoreRead Less
Next Story