BBC Documentary : కేంద్రానికి సుప్రీం నోటీసులు

బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. డాక్యుమెంటరీని నిషేధిస్తూ జారీ చేసిన ఒరిజినల్ ఆర్డర్ కాపీని సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్‌లో ఉంటుందని తెలిపింది.
2002 నాటి గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఇండియా ది మోడీ క్వశ్చన్ పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ లాయర్ శాంతి భూషణ్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, జర్నలిస్ట్ రామ్ సహ పలువురు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. కేంద్రం నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు ప్రముఖ న్యాయవాది ML శర్మ.బీబీసీ డాక్యుమెంటరీని జనవరి 21న కేంద్రం నిషేధించింది. యూట్యూబ్, ట్విట్టర్‌లో అందుకు సంబంధించిన పోస్టులను బ్లాక్ చేయాలని ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com