BBC Documentary : బీబీసీని బ్యాన్ చేయాలన్న హిందూ సేన

BBC Documentary : బీబీసీని బ్యాన్ చేయాలన్న హిందూ సేన
న్యూఢిల్లీలోని బీబీసీ కార్యాలయానికి బోర్డులు వేలాడదీశారు

బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (BBC)ను నిషేదించాలని పిలుపునిచ్చింది హిందూ సేన. ఇందుకుగాను.. న్యూఢిల్లీలోని బీబీసీ కార్యాలయానికి బోర్డులు వేలాడదీశారు హిందూసేన కార్యకర్తలు. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ తీసింది.


అప్పటి గుజరాత్ ప్రభుత్వం గొడవలపై సకాలంలో స్పందించలేదనే విమర్శలు చేసింది. ఈ విషయంపై బీబీసీ డాక్యుమెంటరీ తీసింది. ఈ డాక్యుమెంటరీ ప్రధాని మోదీతో పాటు, భారత ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా తెలిపారు. మోదీ ప్రతిష్టను దిగజార్చేందుకు బీబీసీ అంతర్జాతీయంగా కుట్ర పన్నిందన్నారు. బీబీసీని నిషేదించాలన్న ఆయన.. గతంలో.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బీబీసీని నిషేదించినట్లు గుర్తు చేశారు.


'ఇండియా : మోదీ క్వశ్చన్' అనే డాక్యుమెంటరీ లింక్ లను బ్లాక్ చేయాలని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలను ఆదేశించింది కేంద్రం . సదరు డాక్యుమెంటరీ నిష్పక్షపాతం లేని, వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story