BBC IT Raids: ఐటీ దాడులు కాదు సర్వే మాత్రమే

బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, ముంబై బీబీసీ కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్‌లో అక్రమాలు జరిగినట్లు బీబీసీపై ఆరోపణలు ఉన్నాయి. కొందరు జర్నలిస్టుల ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే తామేమీ సోదాలు చేయడం లేదని.. సర్వే మాత్రమే చేస్తున్నట్లు ఐటీశాఖ అధికారులు తెలిపారు.
ఇటీవల గోద్రా అల్లర్లపై బీబీసీ ఛానల్ ఓ డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. అయితే ఆ డాక్యుమెంటరీపై పెను దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక ప్రధాని మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీని ఇటీవల కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ల్లో ఆ డాక్యుమెంటరీని నిషేధించారు. రెండు భాగాలు ఉన్న ఆ డాక్యుమెంటరీని యూట్యూబ్, ట్విట్టర్‌లో బ్యాన్ చేశారు. కానీ కొన్నికాలేజీలు, వర్సిటీల్లో ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. తాము అదానీ వ్యవహారంపై జేపీసీ అడిగితే.. కేంద్రం బీబీసీ వెంటపడిందన్నారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ జైరామ్ కామెంట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com