BBC Row: మెదీపై డాక్యూమెంటరీ.. JNUలో పవర్ కట్

ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రు యునివర్సిటీలో మంగళవారం ఘర్షణాపూరిత వాతావరణం నెలకొంది. భారత ప్రధాని మోదీపై బీబీసీ నిర్మించిన వివాదాస్పద డాక్యుమెంటరీని లెఫ్ట్ వింగ్ విద్యార్థులు విశ్వవిద్యాలయంలో మంగళవారం రాత్ర 9గంటలకు ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. అడ్మినిష్ట్రేషన్ విద్యుత్తును నిలిపివేయండంతో ప్రదర్శన ఆగి పోయింది. మెబైల్‌ఫోన్‌లో కూడా చూడకుండా జామర్లు ఏర్పాటు చేశారని SFI విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
SFI విద్యార్థి ఫవాస్ మీడియాతో మాట్లాడుతూ మోదీ డాక్యూమెంటరీని మంగళవారం రాత్రి 9గంటలకు స్క్రీనింగ్ చేయాలని చూడగా రాత్రి 8.30 గంటలకే పవర్ కట్ చేశారని తెలిపాడు. 9.30 అయినా కరెంటు రాలేదని... దీంతో విద్యార్థులు ఫోన్లలో చూసేందుకు QRకోడ్ ను డిస్ట్రిబ్యూట్ చేశామని తెలిపారు. జనవరి 23వ తేదీనే రిజిస్ట్రార్‌కు ఈ విషయం గురించి మెయిల్ కూడా పంపామని, ఎలాంటి గొడవలు జరగకుండా కేవలం డాక్యూమెంటరీని ప్రసారం చేస్తామని పేర్కొన్నట్లు తెలిపారు.
అయినా అనుమతించక పోగా జామర్లను కూడా ఉంచారని, దీనిని ప్రసారం చేయకుండా ABVP విద్యార్థులు అడ్డుకున్నారని తెలిపారు. ఇటీవలే ABVP విద్యార్థులు క్యాంపస్‌లో కశ్మీరీ ఫైల్స్‌ను స్క్రీనింగ్ చేశారని అప్పుడు అడ్మినిష్ట్రేషన్ ఎలాంటి అభ్యంతరం తెలపలేదన్నారు. దీనిపై స్పందించిన విశ్వవిద్యాలయం అధికారుల మోదీ డాక్యూమెంటరీ ప్రసారం చేయడం కోసం ఎవరూ అనుమతి కోరలేదని తెలిపింది. ఈ విషయం కొందరు విద్యార్థులు కళాశాలలో రాతప్రతులను పంచడం ద్వారా తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com