BBC Row-Kerala: మోదీకి మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి కొడుకు రాజీనామా

BBC Row-Kerala: మోదీకి మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి కొడుకు రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి ఏకే ఆంటోనీ తనయుడు రాజీనామా; ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసిన అనిల్ కె.ఆంటోనీ...

ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా నినదించేవారు వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ జాబితాలో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ తనయుడు కూడా చేరాడు.


కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా అనిల్ కె.ఆంటోనీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇదే విషయమై అనిల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కన్వీనర్ గా తన పదవికి రాజీనామా పత్రాన్ని సమర్పించానని ట్వీట్ చేశాడు.


మోదీకి మద్దతుగా తాను చేసిన ట్వీట్ పై విపరీతమైన ట్రోలింగ్ కు గురవ్వడమే కాకుండా, సొంత పార్టీ వ్యక్తులు సైతం తనకు కాల్ చేసి దూషిస్తున్నారని తెలిపాడు. దీనిపై విరక్తి చెందే రాజీనామాకు సిద్ధమైనట్లు ట్వీట్ ద్వారా వెల్లడించాడు. ఇది వాక్ స్వాతంత్రాన్ని హరించడమే అని వాపోయాడు.


తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ సేవలోనే ఏకే ఆంటోనీ కుటుంబం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 24న వ్యక్తిగతంగా భాజాపా బావజాలాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. మన దేశాన్ని చెరపట్టి పీడించిన బ్రిటీషర్లు మన దేశ ప్రధానిపై రూపొందించిన డాక్యుమెంటరీని ఆమోదించలేమని ట్వీట్ చేశాడు. ఇరాక్ యుద్ధానికి కారణమైన ఆ దేశం మన సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని తెలిపాడు.


ఇక తాజా ట్వీట్ కు రాజీనామా పత్రాన్ని సైతం జతచేసిన అనిల్ కేరళ నాయకత్వానికి, డా.శశిథరూర్ తో పాటూ తనకు అన్ని విధాలా మార్గనిర్దేశం చేసిన వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు.


Tags

Read MoreRead Less
Next Story