Beat the Heat: ఎండలు మండుతున్నాయ్.. ఎలా ఉంది నా ఐడియా: ఆటోరిక్షా వాలా

Beat the Heat: ఎండలు మండుతున్నాయ్.. ఎలా ఉంది నా ఐడియా: ఆటోరిక్షా వాలా
Beat the Heat: అంతటా ఎండలు అలాగే ఉన్నాయి.. కానీ దేశ రాజధానిలో మరింత మండుతున్నాయ్ ఎండలు..

Beat the Heat: గత కొన్ని వారాలుగా తీవ్రమైన వేడిగాలులతో అల్లాడుతున్నా ఢిల్లీ నగర వాసులు. ఇలాంటి సమయంలో, ఒక ఆటోరిక్షా డ్రైవర్ తన వాహనం లోపల చల్లగా ఉండాలనే ఆలోచనతో ఓ ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకున్నాడు. ఆటో రిక్షా డ్రైవర్ మహేంద్ర కుమార్ ఫోటోలు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల నుండి ప్రశంసలను అందుకుంటున్నాడు.

వేసవి కాలంలో తన ఆటోలో ప్రయాణిస్తున్న వారికి చల్లగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆటో పై కప్పు అంతా పచ్చని మొక్కలను ఏర్పాటు చేశాడు. రాజధానిలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ (113 ఫారెన్‌హీట్) తాకినప్పటికీ, తన వాహనం చల్లగా ఉంటుందని కుమార్ చెప్పారు.

"సుమారు రెండేళ్ళ క్రితం వేసవి కాలంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. నేను పైకప్పుపై కొన్ని మొక్కలను పెంచగలిగితే, అది నా ఆటోను చల్లగా ఉంచుతుంది మరియు నా ప్రయాణీకులకు వేడి నుండి ఉపశమనం ఇస్తుందని నేను అనుకున్నాను, "అలాగే ఆటో లోపల రెండు మినీ కూలర్లు, ఫ్యాన్లు కూడా అమర్చాడు.

"ఇది ఇప్పుడు సహజమైన AC (ఎయిర్ కండీషనర్) లాగా ఉంది. నా ప్రయాణీకులు రైడ్ తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు, వారు నాకు అదనంగా చెల్లించడానికి కూడా ఏమీ ఇబ్బంది పడట్లేదు అని చెబుతున్నాడు మహేంద్ర.


తన ఆటోరిక్షాలో మొక్కలు పెంచడానికి అనుకూలంగా పైకప్పును సిద్ధం చేశాడు. మొదట ఒక చాపను పరిచి దానిపై మందపాటి గోనె సంచులు ఉంచాడు.. దాని మీద మట్టిని పోసి విత్తనాలు చల్లాడు.

కొన్ని రోజులకే విత్తనాలు ఆకుపచ్చని రెమ్మలుగా మొలకెత్తాయి. "దీనికి పెద్దగా శ్రమ అవసరం లేదు. నేను రోజుకు రెండుసార్లు బాటిల్ ఉపయోగించి మొక్కలకు నీళ్ళు పోస్తాను, "అని అతను చెప్పాడు. కుమార్ తన తోటి డ్రైవర్లకు ప్రేరణ అయ్యాడు.

పెట్రోల్ లేదా డీజిల్ కంటే తక్కువ కాలుష్యం కలిగించే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌తో నడిచే కుమార్ యొక్క క్లీన్ అండ్ గ్రీన్ ఆటో నైమా జమాల్ అనే బాటసారిని బాగా ఆకట్టుకుంది. "ఇది ఒక గొప్ప ఆలోచన అని ఆమె అతడిని ప్రశంసించింది. "ఢిల్లీ కాంక్రీట్ జంగిల్‌గా మారింది, ఎక్కడా పచ్చదనం లేదు. "మన రోడ్లపై ఇలాంటి ఆటోరిక్షాలు మరిన్ని కావాలి - అవి కళ్ళకు ఆహ్లాదాన్ని మనసుకు ప్రశాంతతను ఇస్తాయి అని ఆమె అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story