బెడ్ లేదు.. ట్రీట్‌మెంట్ లేదు.. ఇంజక్షన్ ఇచ్చి నాన్నని చంపేయండి: ఓ కొడుకు దైన్యం

బెడ్ లేదు.. ట్రీట్‌మెంట్ లేదు.. ఇంజక్షన్ ఇచ్చి నాన్నని చంపేయండి: ఓ కొడుకు దైన్యం
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. సకాలంలో వైద్యం అందక కొందరు, భయంతో హార్ట్ అటాక్ వచ్చి కొందరు మరణిస్తున్నారు.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. సకాలంలో వైద్యం అందక కొందరు, భయంతో హార్ట్ అటాక్ వచ్చి కొందరు మరణిస్తున్నారు. కోవిడ్‌తో మరణించే కేసుల కంటే ఈ విధంగా మరణించే వారి సంఖ్య కూడా ఎక్కువైందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య ఎక్కువవడంతో ఆస్పత్రులపై అధిక భారం పడుతోంది.

దవాఖానాల్లో బెడ్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రులలో బెడ్లు లేక తీవ్ర అనారోగ్యానికి గురై మరణించిన వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది.

అంబులెన్స్‌లలో చికిత్స పొందుతున్న సంఘటనలు కూడా అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన సాగర్ కిషోర్, కోవిడ్‌తో బాధపడుతున్న తన అనారోగ్య, వృద్ధ తండ్రిని బ్రతికించుకోవడం కోసం ఆసుపత్రి వారిని వేడుకున్నా లాభం లేకపోయింది.

బెడ్లు ఖాళీ లేవని ఆస్పత్రి సిబ్బంది చేతులెత్తేసారు. మహారాష్ట్రలో ప్రయత్నించినా ఫలితం కనబడకపోవడంతో పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ప్రయత్నించారు. ఇక్కడ కూడా అతడికి నిరాశే ఎదురైంది. దీంతో విసుగు చెందిన అతడు నిస్సహాయతతో నాతండ్రికి ట్రీట్‌మెంట్ అయినా చేయండి లేదంటే ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి" అని అంటున్నాడు.

తన తండ్రి స్థానిక ఆసుపత్రి వెలుపల అంబులెన్స్‌లో పడుకోవడంతో, అతను ఇలా అన్నాడు. నేను అతన్ని ఇలా ఇంటికి తీసుకెళ్లలేను బెడ్స్ అందుబాటులో లేకపోవడంతో తన తండ్రి యొక్క ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయని వాపోతున్నాడు. నిన్న ఇలాంటి ఒక సంఘటనలో, 30 ఏళ్ల మహిళ హజారిబాగ్ నుండి రాంచీకి ప్రయాణించి, కోవిడ్ సోకిన తండ్రిని సదర్ ఆసుపత్రిలో చేర్పించింది.

వైరల్ అయిన ఒక వీడియోలో, ఆ మహిళ సహాయం కోసం వేచి చూస్తూ ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో దాదాపు 30 నిమిషాలు వేచి ఉంది. డాక్టర్ వచ్చే సమయానికి, ఆమె తండ్రి చనిపోయారు. ఇలాంటి సంఘటనలు మహమ్మారి సమయంలో విస్తృతంగా వెలుగులోకి వస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story