ఢిల్లీలో లాక్‌డౌన్‌ : వైన్ షాపులకు పరిగెత్తుతున్న మందుబాబులు

ఢిల్లీలో లాక్‌డౌన్‌ :  వైన్ షాపులకు పరిగెత్తుతున్న మందుబాబులు
ఢిల్లీలో లాక్‌డౌన్‌ ప్రకటించడం ఆలస్యం.. మందుబాబులంతా వైన్ షాపులకు పరిగెత్తారు. దేశ రాజధానిలోని ఏ వైన్ షాపు దగ్గర చూసినా జనాలు గుమిగూడిన పరిస్థితి కనిపిస్తోంది.

ఢిల్లీలో లాక్‌డౌన్‌ ప్రకటించడం ఆలస్యం.. మందుబాబులంతా వైన్ షాపులకు పరిగెత్తారు. దేశ రాజధానిలోని ఏ వైన్ షాపు దగ్గర చూసినా జనాలు గుమిగూడిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కొక్కరు కనీసం నాలుగైదు బాటిల్స్ పట్టుకుని బయటికొస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. చేతిలో నాలుగు బాటిల్స్ పట్టేంత పరిస్థితి లేకపోయినా సరే.. వీలు చేసి మరీ ఐదారు బాటిల్స్ పట్టుకెళ్లడం చాలా క్లియర్‌గా కనిపించింది.

వైన్ షాపులకు జనం జాతరకు వెళ్లినట్టు వెళ్లడం చూస్తుంటే.. లాక్‌డౌన్ వల్ల కరోనా కంట్రోల్‌లోకి రావడం కాదు.. మందు బాబుల తొందర కారణంగా మరింత వ్యాపించే ప్రమాదం కనిపిస్తోంది. ఆడవాళ్లు కూడా తామేం తక్కువ కాదన్నట్టు.. వైన్ షాపుల ముందు క్యూలు కట్టారు. మగాళ్లను తోసుకుంటూ వెళ్లి మరీ బాటిళ్లను చేజిక్కించుకుంటున్నారు. ఢిల్లీలో వైన్‌ షాపుల ముందు పరిస్థితులు కంట్రోల్ తప్పుతున్నాయి.

లాక్ డౌన్ విధించడంతో అటు వలస కార్మికులు స్వస్థలాల బాట పట్టారు. పెట్టా, బేడా సర్దుకుని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు క్యూ కట్టారు. దీంతో ఆ ప్రాంతాలన్ని వలస కార్మికులతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు ఢిల్లీలో మద్యం దుకాణాలకు జనం పోటెత్తారు. పలు చోట్ల భౌతిక దూరం, మాస్కులు ధరించకుండా పెద్ద సంఖ్యలు బారులు తీరారు.

కరోనా ఉధృతి తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఆరు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉండనుందని వెల్లడించారు. కరోనా చైన్ తెగ్గొటేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story