West Bengal : 43 మందితో కొలువుదీరిన దీదీ మంత్రివర్గం..!

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 43 మందితో తన మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. 43 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జగదీప్ ధంఖర్ వారితో ప్రమాణం చేయించారు. దీదీ కొత్తగా 17 మందికి మంత్రులుగా అవకాశమిచ్చారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించారు. మొత్తం 43 మంది ఉన్న మంత్రి మండలిలో 24 మందికి కేబినెట్ పదవులు దక్కగా 10 మందికి స్వతంత్ర్య హోదా లభించింది. మరో 9 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. కాసేపట్లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో 292 సీట్లకు గాను టీఎంసీ 213 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. కాగా ఈనెల 5వ తేదీన ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com