Bengal Woman : మాటల్లేవ్.. నీ గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ అంతే...!

Kolkata : పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లు జరిగినప్పుడు వచ్చిన అతిధులను వెరైటీ ఫుడ్స్‌తో ఆకట్టుకొని వారికీ కడుపునిండా భోజనం పెడుతారు. అందరికీ సరిపడే భోజనం అందించే క్రమంలో కొంతమేరకు ఆహారం మిగిలిపోతుంది. అయితే అలా మిగిలిపోయిన ఆహారాన్ని పడేయకుండా స్వయంగా రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్ళి పేదలు కడుపు నింపింది ఓ మహిళ.
ఈ ఘటన పచ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. కోల్‌కత్తాకి చెందిన సదరు మహిళ సోదరుడు వివాహం శనివారం రాత్రి జరిగింది. వివాహంలో మిగిలిపోయిన ఆహారాన్ని పడేయకుండా పేద ప్రజలకు పంచాలని ఆమె అనుకుంది. ఆదివారం తెల్లవారుజామున 1గంట సమయంలో కోల్‌కత్తా లోని సబర్బన్ రైల్వేస్టేషన్ అయిన రానాఘాట్ జంక్షన్ వద్దకి చేరుకొని రైల్వే ఫ్లాట్ ఫాంపై కూర్చొని తానే స్వయంగా పేపర్ ప్లేట్లలో వారికి ఆహారాన్ని వడ్డించింది.
దీనిని గమనించిన నిలంజన్ మొండాల్ అనే ఓ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇవి వైరల్‌గా మారాయి. దీనితో ఆమెను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com