Bengaluru: షర్ట్ విప్పు... లేదంటే...! సెక్యూరిటీ చెక్ లో మహిళకు చేదు అనుభవం
Bengaluru

ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఓ ప్రయాణీకురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగుళూరు విమానశ్రయంలో సెక్యూరిటీ అసభ్యంగా ప్రవర్తించారని, తన షర్ట్‌ను తొలగించమని ఇబ్బంది పెట్టి అవమానించారని కృషాని గాద్వి అనే మహిళ ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
బెంగళూరులోని కెంపెగౌడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లోని సెక్యూరిటి చెక్ వద్ద తనకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. చెక్ పాయింట్ వద్ద అధికారులు షర్ట్ విప్పమని బలవంతంగా ఇబ్బంది పెట్టి అవమానించారని రాసుకొచ్చింది. కేవలం చిన్నపాటి కామియోసోల్ ధిరించి అందరి దృష్టిలో పడటం అవసరం లేదని తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.
ఈ వ్యవహారం అంతా తనను ఎంతగానో కృంగదీసిందని వాపోయింది గాద్వి. అసలు బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో మహిళలు ఎందుకు బట్టలు విప్పాలి అంటూ నిలదీసింది. ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారి కెంపేగౌడా అంతర్జాతీయ విమానాశ్రయ సిబ్బంది దృష్టికి చేరింది. కొందరు నెటిజన్లు ఆమెకు సపోర్ట్ కూడా ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఆ మహిళకు ఎదురైన అనుభవం పట్ల ఎయిర్‌పోర్ట్ సిబ్బంది స్పందించింది. ఆమెకు జరిగిన అసౌకర్యం పట్ల చర్యలు తీసుకుంటామని. దీనిపై విచారణ చేసేందుకు ఈ సంఘటనను CISFకు దృష్టికి తీసుకువెళతామని వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com