Bengaluru: బెంగళూరు స్కూల్ బాంబ్ కేస్... సరదా కోసమే...

Bengaluru: బెంగళూరు స్కూల్ బాంబ్ కేస్... సరదా కోసమే...
బెంగళూరు స్కూల్ లో బాంబ్ కేసులో కీలక మలుపు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు; వాస్తవాలు తెలుసుకుని హుతాశులైన పోలీసులు

బెంగుళూరు స్కూల్ లో బాంబు కేసు కీలక మలుపు తిరిగింది. బస్వేశ్వర నగర్‌లోని నేషనల్‌ అకాడమీ స్కూల్‌కు శుక్రవారం ఓ ఆకతాయి బాంబు త్రెట్‌ ఉందని మెయిల్‌ చేసిన కేసును కర్నాటక పోలీసులు చేధించారు. ఈ కేసులో అదే స్కూలుకు చెందిన మైనర్‌ బాలున్ని అదుపులోకి తీసుకున్నారు.


పోలీసుల కథనం మేరకు సదరు బాలుడు సరదా కోసం స్కూల్లో నాలుగు జిలిటిన్‌ స్టిక్స్‌ అమర్చామని వాటిని బ్లాస్ట్‌ చేస్తామని బూటకపు మెయిల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన స్కూల్‌ సిబ్బంది 1000 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. స్కూల్‌ పరిసర ప్రాంతానికి చెందినవారు సహా, విద్యార్ధుల తల్లితండ్రులు ఆందోళనకు గురయ్యారు.


సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌తో వచ్చి తనిఖీ చేయగా ఎక్కడా ఏమీ దొరకలేదు. ఇక ఈ ఘటనపై దర్యప్తు ప్రారంభించిన పోలీసులు నఖిల్ అనే విద్యార్థే మెయిల్‌ మెయిల్ చేశాడని గుర్తించాడు. మైనర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా, కేవలం సరదా కోసమే ఈ పని చేసినట్లు అంగీకరించాడు. ప్రస్తుతం నిఖిల్ ను జువినైల్‌ కోర్టుకు తరలించారు.



Tags

Read MoreRead Less
Next Story