Bengaluru: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌ షో ప్రారంభం

Bengaluru: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌ షో ప్రారంభం
ఇండియన్‌ బిగ్గెస్ట్ ఏరోస్పేస్, ఢిఫెన్స్‌ ఎగ్జిబిషన్ 14వ ఎడిషన్ ఏరో ఇండియాని బెంగళూరులో ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ

ఇండియన్‌ బిగ్గెస్ట్ ఏరోస్పేస్, ఢిఫెన్స్‌ ఎగ్జిబిషన్ 14వ ఎడిషన్ ఏరో ఇండియాని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బెంగళూరులో ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయ విమాన రంగాన్ని ఈ ఎక్స్‌పో ఎలివేట్ చేయబోతోంది. మొత్తం 5 రోజులపాటు రకరకాల విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, విమాన రంగ కంపెనీల ఉత్పత్తులు, రక్షణ రంగ ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తారు. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన EMB-145, Su-30, MIG-29 యుద్ధ విమానాలు ఆదివారం నేత్ర కాన్సెప్ట్‌లో భాగంగా ఆకాశంలో ఎగురుతూ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ చేశాయి.

మిలిటరీ, సివిల్‌ యావివేషన్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులను తెలుసుకునేందుకు ఈ ఎక్స్‌పో లో అవకాశం ఉంది ఎలక్ట్రానిక్‌ యుద్ధ నైపుణ్యాలు, కమ్యూనికేషన్లలో మార్పులు, సీసీటీవీ సెక్యూరిటీ, బుల్లెట్‌ఫ్రూఫ్‌ జాకెట్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్లు, హెలికాప్టర్లు, ఆయుధాలు ఇలా ఎన్నో అంశాలు తెలుసుకునేందుకు ఇది సరైన వేదిక అని ఆర్మీ అధికారులు అంటున్నారు. ఈ కార్యక్రమానికి విదేశీ ప్రతినిధులు, నిపుణులు హాజరవుతున్నారు. మేక్‌ ఇన్‌ ఇండియాతో తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించి ప్రపంచాన్ని ఆకర్షించే అవకాశం ఉంది.

మరోవైపు రాడార్లకు దొరకని స్టెల్త్‌ టెక్నాలజీ, హై ఆటోమేషన్‌ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న 5G వార్‌ ఫైటర్స్‌ కూడా ఈ షోలో ప్రదర్శించనున్నారు. రష్యా, చైనా, యూరప్‌ దేశాలు కూడా ఎంతో కాలంగా 5G వార్‌ ఫైటర్స్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వీటిని పూర్తిస్ధాయిలో సాధించలేకపోయాయి. అయితే మనదేశంలో ఏడీఏ, డీఆర్‌డీవో ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయి. కొన్ని డిజైన్లను పరిశీలిస్తున్నాయి. డిజైన్లు ఓకే అయితే త్వరలోనే మన దేశ ఆర్మీలోకి ఇవి పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. ఏరో ఇండియా 2023లో డ్రోన్లు ఉత్పత్తి చేసే ఎన్నో సంస్థలు భాగస్వాములవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story