Bengaluru: ఫిర్యాదు చేయడానికి వెళితే చెరపట్టాడు

X
By - Chitralekha |12 April 2023 12:32 PM IST
భర్తపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యువతి; రక్షించాల్సిందిపోయి...
ఆపదలో ఉన్నాను రక్షించమంటూ పోలీసులను ఆశ్రయించిన యువతికి వారి నుంచే మరిన్ని వేధింపులు ఎదురైన వైనం బంగళూరులో చోటుచేసుకుంది. తనపై గృహహింసకు పాల్పడుతున్న భర్తపై ఫిర్యాదు చేసేందుకు బెంగళూరులోని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది ఓ యువతి. అయితే ఆమె నిస్సహాయ స్థితిని ఆసరాగా తీసుకుని సదరు ఇన్స్పెక్టర్ ఆమెపై వేధింపులకు పాల్పడటం మొదలుపెట్టాడు. ఆమె చేయిని గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆమె అక్కడి నుంచి వెళ్లిన దగ్గర నుంచి వేధింపులు తీవ్రతరం చేశాడు. బాధితురాలి ముబైల్ కు అసభ్యకర సందేశాలు పంపించడంతో పాటూ బిర్యానీ కావాలి అంటూ ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఈ చేష్ఠలకు విసిగిపోయిన బాధితురాలు మీడియాను ఆశ్రయించడంతో సదరు ఇన్స్పెక్టర్ బాగోతం బయటపడింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com