జోమాటో కేసు ఆగిపోయింది..!

సోషల్ మీడియాలో వైరల్ అయి.. తీవ్ర చర్చనీయాంశమైన జోమాటో డెలివరీ బాయ్, యువతి కేసు దర్యాప్తు తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ కేసుకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించినందున దర్యాప్తును నిలిపివేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ మేరకు విచారణాధికారి మాట్లాడుతూ.." సీసీటీవీ ఫుటేజీ ఉంటే, అసలు అక్కడ ఏం జరిగింది అన్న విషయం తెలిసేది. కానీ అక్కడ సీసీ కెమెరా లేదు. కేవలం యువతి ఆరోపణల ఆధారంగా ముందుకు వెళ్లలేమని" అన్నారు.
కాగా ఆర్డర్ ఆలస్యమైనందుకు ప్రశ్నించినందుకు, జొమాటో డెలివరీ బాయ్ తనపై దాడి చేశాడంటూ బెంగుళూరుకి చెందిన హితేషా చంద్రాణి అనే యువతి ఓ వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. యువతి ఫిర్యాదు మేరకు డెలివరీ బాయ్ అయిన కామరాజును పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చిన కామరాజు.. తన పైన యువతి ఏ పొలీస్ స్టేషన్ లో అయితే కేసు పెట్టిందో.. అదే పొలీస్ స్టేషన్ లో తిరిగి యువతి పైన కేసు పెట్టాడు.
Also Read : యువతికి షాకిచ్చిన జొమాటో డెలివరీ బాయ్.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లో కేసు..!
తానూ ఆ యువతి పైన ఎలాంటి దాడి చేయలేదని, డెలివరీ ఆలస్యం అయినందుకు తానూ క్షమాపణలు కూడా చెప్పినట్టుగా వెల్లడించాడు. తనను అవమానించినందుకు గాను యువతిపై కేసు పెట్టినట్టుగా డెలివరీ బాయ్ మీడియాకి వెల్లడించాడు. అయితే ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసును తాత్కాలికంగా వాయిదా వేశారు పోలీసులు..!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com