స్నేహితుడి ఇంట్లో మహిళా సీఐడీ అధికారి ఆత్మహత్య

స్నేహితుడి ఇంట్లో మహిళా సీఐడీ అధికారి ఆత్మహత్య
X
మహిళా అధికారి ఆత్మహత్య చేసుకోవడం అటు స్థానికులను, ఇటు డిపార్ట్‌మెంట్ అధికారులను కలవరానికి గురి చేసింది

పోలీసులకు సైతం అంతు చిక్కని కేసుల వ్యవహారాన్ని సిబీఐకి అప్పగిస్తుంటారు. ఈ పరిశోధనల్లో వారు మరింతగా రాటుదేలుతారు. అలాంటి డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే మహిళా అధికారి ఆత్మహత్య చేసుకోవడం అటు స్థానికులను, ఇటు డిపార్ట్‌మెంట్ అధికారులను కలవరానికి గురి చేసింది. 33 ఏళ్ల పివి లక్ష్మి డీఎస్పీ ర్యాంక్ అధికారి. గత రాత్రి తన స్నేహితుడి ఇంటికి డిన్నర్‌కి వెళ్లి. అనంతరం ఇద్దరి మద్య ఏం జరిగిందో ఏమో రాత్రి 10.30 గంటల సమయంలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.

2014 లో కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కెపిఎస్సి) లో విజయం సాధించిన లక్ష్మి 2017 లో సిఐడిలో చేరారు. ఒక అత్యున్నత స్థాయి ఉద్యోగి ఈ విధమైన చర్యకు పాల్పడడానికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు.

Tags

Next Story