Semi-High-Speed Train: రెండున్నర గంటల్లో బెంగళూరు నుండి హైదరాబాద్‌కు : త్వరలో సెమీ-హై-స్పీడ్ రైలు

Semi-High-Speed Train: ఈ ట్రెయిన్ ద్వారా బెంగళూరు నుండి హైదరాబాద్‌కు కేవలం 150 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. భారతీయ రైల్వేలు రెండు మహానగరాల మధ్య సెమీ-హై-స్పీడ్ ట్రాక్‌ను నిర్మించాలని యోచిస్తోంది రైల్వేశాఖ.
ఇండియా ఇన్‌ఫ్రాహబ్ తన నివేదికలో, రైల్వే ట్రాక్ గంటకు 200 కిమీ వేగంతో రైళ్లను నడపడానికి సిద్ధంగా ఉందని పేర్కొంది. దీంతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని రెండున్నర గంటలకు తగ్గించవచ్చని పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి గతి శక్తి చొరవలో భాగంగా నిర్మించబడుతుంది. దీని కోసం దాదాపు రూ. 30,000 కోట్లు ఖర్చవుతుందని నివేదించబడింది.
బెంగళూరులోని యలహంక స్టేషన్ నుంచి హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ స్టేషన్ మధ్య 503 కిలోమీటర్ల మేర రైలు నెట్‌వర్క్‌ను నిర్మించనున్నారు. భద్రతా ప్రయోజనం కోసం, ఈ సెమీ-హై స్పీడ్ రైల్వే ట్రాక్‌కి ఇరువైపులా 1.5 మీటర్ల ఎత్తులో ఫెన్సింగ్ గోడ కూడా నిర్మించబడుతుంది. రైలు వేగానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా నడపడానికి ఇది సహాయపడుతుందని తెలిపింది.
ప్రస్తుతం ఉన్న సదుపాయాలతో హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రయాణించడానికి సాధారణంగా 10 నుండి 11 గంటల సమయం పడుతుంది. అయితే ఈ కొత్త సెమీ హైస్పీడ్ రైలుతో కేవలం 150 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. అంటే రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు.
అంతేకాకుండా, ఈ రెండు నగరాలు రోడ్డు మార్గం ద్వారా కూడా చేరువ కానున్నాయి. ఈ నెల ప్రారంభంలో, కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ వే గురించి మాట్లాడుతూ ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాణానికి సిద్ధంగా ఉన్న తర్వాత రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం రెండు గంటలకు తగ్గుతుందని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com