'మైనే ప్యార్ కియా' చిత్రంలో నటించనన్నాను: భాగ్యశ్రీ

మైనే ప్యార్ కియా చిత్రంలో నటించనన్నాను: భాగ్యశ్రీ
స్క్రిప్ట్ అందంగా ఉంది. అతను నాకు స్టోరీ వివరించిన తీరు నచ్చింది. కానీ నేను స్క్రిప్ట్‌ను ఇష్టపడుతున్నప్పటికీ..

తెలుగులో ప్రేమ పావురాలుగా విడుదలైన హిందీ చిత్రం మైనే ప్యార్ కియా యువతను ప్రేమలోకంలో విహరింపజేసింది. ఈ చిత్రంలోని పాటలన్నీ సంగీత ప్రియులను అలరించాయి. ఇందులో నటించిన హీరో, హీరోయిన్ల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో ఆనాటి సంగతులను పంచుకున్నారు.

'మైనే ప్యార్ కియా!' నేను దీన్ని చేయాలనుకోలేదు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని అనుకున్నాను. అక్కడ ప్రవేశం కూడా పొందాను. కానీ నాన్నకు నేను విదేశాల్లో చదువుకోవడం ఇష్టంలేదు. భారతదేశంలోనే నా విద్యను పూర్తి చేయాలని కోరుకున్నారు. అదే సమయంలో 'మైనే ప్యార్ కియా' లో హీరోయిన్‌గా ఆఫర్ వచ్చింది.

అప్పుడు నేను ఆ చిత్ర దర్శకుడు సూరజ్ బర్జాత్యకి.. నాకు సినిమాల్లో పనిచేయడం ఇష్టం లేదని చెప్పాను. నేను ఎందుకు వద్దంటున్నానో అతనికి అర్థం కాలేదు. స్క్రిప్ట్ అందంగా ఉంది. అతను నాకు స్టోరీ నాకు వివరించిన తీరు నచ్చింది. కానీ నేను స్క్రిప్ట్‌ను ఇష్టపడుతున్నప్పటికీ నటించనని చెప్పాను.

అతను నన్ను ఒప్పించేందుకు స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేస్తూ ఏడుసార్లు నా వద్దకు వచ్చారు. అయినా ప్రతిసారీ నేను ఏదో ఒక కొత్త సాకు చెబుతూ వస్తున్నాను. కానీ ఎనిమిదవ సారి నేను కాదనలేకపోయాను. ఆ సినిమాలో నటిస్తానని చెప్పాను.

నేను ఎవరికీ తెలియని క్రొత్త వ్యక్తిని. ఆ సినిమాలో నటించాలని సూరజ్ పట్టుదలతో ఉన్నాడు. 'మైనే ప్యార్ కియా ...' కి ముందు 'కచ్చి ధూప్' చేసాను. ఆ చిత్రంలో నటించే హీరోయిన్ చివరి నిమిషంలో తన ప్రియుడితో కలిసి పారిపోయింది. మరియు అప్పటికే నటరాజ్ స్టూడియోలో ఒక సెట్ నిర్మించబడినందున, ఒకేసారి షూటింగ్ ప్రారంభించాల్సి వచ్చింది.

నటన గురించి నాకు ఏమీ తెలియదని నేను చెప్పినప్పుడు, అతను నా మామూలు నేనే అని చెప్పాడు. దర్శకుడు అమోల్ పాలేకర్ నన్ను నటించమని అడిగారు. దగ్గరి బంధువు కావడంతో ఆ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాను. నేను ఆ చిత్రంలో నటించడం ద్వారా దర్శకుడికి సహాయం చేస్తున్నానని అనుకున్నాను, కానీ నాన్న నన్ను కూర్చోబెట్టి పరిస్థితిని వివరించారు.

నువ్వు అతనికి సహాయం చేయడానికి అంగీకరించినందున, నీ హృదయాన్ని, ఆత్మను అందులో ఉంచాలి, కొత్త విషయాలు అడిగి తెలుసుకోవాలి. ఒకరి డబ్బు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుందని దానిని గౌరవించాలని చెప్పారు. తరువాత అమోల్ అంకుల్ కలిసినప్పుడు నటనకు సంబంధించి చాలా ప్రశ్నలు అడిగాను. నా ఆసక్తిని గమనించిన ఆయన ఏదో ఒక రోజు గొప్ప హీరోయిన్ అవుతావు అని అన్నారు. అప్పుడే 'మైనే ప్యార్ కియా' నా దారికి వచ్చింది.

ఆ చిత్ర సెట్లో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేస్తున్నందున, దేవుడు ప్రతిఫలమిస్తాడని నమ్మాను. సల్మాన్‌కి, సూరజ్‌కి, నాకు ఇది తొలి వెంచర్. ప్రస్తుతం ప్రభాస్‌ 'రాధే శ్యామ్' చిత్రంలో భాగ్యశ్రీ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నారు. ప్రభాస్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

Tags

Next Story