Bharat - China : మరిన్ని ఘర్షణలకు ఆస్కారం

ఇండో - చైనా బార్డర్ లో భారత సైనికులకు చైనా ఆర్మీకి మధ్య మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాయిటర్స్ నివేదికను విడుదల చేసింది. చైనా తన బార్డర్ ఫోర్స్ కు నిధులు పెంచడమే ఇందుకు కారణమని తెలిపింది. లడఖ్ పోలీసుల రిపోర్ట్ లో కూడా, రానున్న రోజుల్లో ఘర్షణ వాతావారణం ఉండవచ్చని తెలుస్తోంది. జనవరి 20 నుంచి 22మధ్య లదాఖ్ పోలీసులు సమావేశం జరిగింది. ఇందులో పోలీసులు రూపొందించిన రహస్య నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తోంది. దీంతో భారత బలగాలు అప్రమత్తమయ్యాయి.
జూన్ 2020లో గాల్వాన్ వ్యాలీ లడఖ్ లో ఇరు పక్షాల మధ్య అంత్యంత తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణతో భారత్ - చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. గత సెప్టెంబర్ లో గోగ్రా - హాట్ స్ప్రింగ్ ప్రాంతంలోని పెట్రోలింగ్ పాయింట్15 నుంచి ఇరు దేశాల మిలటరీలు వైదొలిగాయి. డిసెంబర్ లో అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో భారత్ - చైనా ఆర్మీల మధ్య ఘర్షణ చెలరేగింది. సరిహద్దు ప్రాంతాల్లో స్థానిక పోలీసులు సేకరించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా సైనిక ఉద్రిక్తతలు సంభవించవచ్చని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com